VIRAL VIDEO OF POLICE KISSED BY A YOUTH IN HYDERABAD MS
బోనాల జాతరలో ఆకతాయి చేసిన పనికి షాక్ తిన్న ఎస్ఐ
ఎస్ఐకి ముద్దుపెడుతున్న యువకుడు
బోనాల జాతరలో మద్యం మత్తులో ఫుల్లుగా డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు.. అటుగా వెళ్తున్న ఓ ఎస్ఐకి అనుకోని షాక్ ఇచ్చాడు. ఎస్ఐని ఆపి అతని చెంపపై గట్టిగా ముద్దుపెట్టాడు.
హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎస్ఐకి విచిత్ర అనుభవం ఎదురైంది. బోనాల జాతర డ్యూటీలో ఉన్న సదరు ఎస్ఐ.. రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ యువకుడు గబుక్కున వచ్చి ముద్దు పెట్టాడు. దీంతో ఎస్ఐ సహా అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు.ఎస్ఐకి ముద్దు పెట్టిన తర్వాత.. అసలేమీ జరగనట్టు ఆ యువకుడు మళ్లీ డ్యాన్స్‌లో నిమగ్నమైపోయాడు. యువకుడి చర్యతో కోపోద్రిక్తుడైన ఎస్ఐ..అతన్ని మందలించేందుకు ముందుకు కదిలాడు. దీంతో ఎస్ఐ ఆగ్రహానికి భయపడి.. అతను కాస్త వెనక్కి తగ్గాడు. ఆపై ఎస్ఐ అక్కడినుంచి వెళ్లిపోవడంతో యథావిధిగా డ్యాన్స్‌లో లీనమయ్యాడు. సదరు యువకుడు మద్యం మత్తులో ఉండటం వల్లే ఇలాంటి చర్యకు పాల్పడి ఉంటాడని అంటున్నారు. దీనికి సంబంధించిన
వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.