రైతులకు అండగా ప్రభుత్వం.. పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక

వినోద్ కుమార్ (ఫైల్)

సిరిసిల్ల కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, కరోనా నివారణ చర్యలపై కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, ఇతర ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

  • Share this:
    జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, కరోనా నివారణ చర్యలపై కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, ఇతర ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో ప్రపంచానికి భారత్ దిక్సూచిగా నిలిచిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడుసార్లు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిందని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రణాళికా సంఘం వైస్ చై‌ర్మన్ వినోద్‌కు తెలిపారు. ప్రధానంగా వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు పంట బీమా కేవలం 10 నుంచి 15 శాతం పంటలకు మాత్రమే చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published: