Home /News /telangana /

VILLAGERS PERFORMED THE LAST RITES OF A MONKEY IN SANGAREDDY DISTRICT OF TELANGANA SNR MDK

Telangana : వానరానికి అంత్యక్రియలు .. ఆ గ్రామస్తులు ఎంత మంచివాళ్లో

(monkey rites)

(monkey rites)

Telangana: ఆ ఊరోళ్లు చాలా మంచి వాళ్లు. మనుషులు కష్టాల్లో ఉంటేనే పట్టించుకోని ఈరోజుల్లో చనిపోయిన వానరాన్ని సొంత మనిషిగా భావించారు. మనిషికి నిర్వహించినట్లుగా అంత్యక్రియలు నిర్వహించి మూగజీవాలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

మానవత్వం, జాలిగుణం ఉంటే నోరు లేని జీవాల్ని కూడా మనుషుల్లా చేస్తారు జనం. రాను రాను మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతుందనే విమర్శలు సరికాదని ఆ ఊరి జనం నిరూపించారు. గ్రామంలో తమతో కలిసి జీవించిన ఓ వానరానికి (Monkey)సహృదయంతో అంత్యక్రియలు(rites)నిర్వహించారు. ఒక ఆప్తుడ్ని దూరమైనంతగా ఫీలయ్యారు. ఇంతటి వెరైటీ సంఘటన సంగారెడ్డిSangareddy జిల్లాలో చోటుచేసుకుంది.

Murder Plan : యాక్సిడెంట్ స్టైల్లో హత్య .. అత్తమామ పాలిట అల్లుడే విలన్



ఆ ఊరి జనం ఎంత మంచోళ్లో..
కోతుల నుంచే మనుషులు రూపాంతరం చెందారని చరిత్ర చెబుతోంది. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని నిజంగా కోతులంటే ప్రతి మనిషికి తెలియని ఇష్టం ఉంటుంది. కొందరిలో భయంతో కూడిన ప్రేమ ఉంటుంది. అందుకేనేమో ఆ ఊరి జనం ఓ కోతి చనిపోతే కుటుంబ సభ్యుడిని కోల్పోయినంతగా ఫీలయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని నారాణయఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఓ వానరం చనిపోయింది. గ్రామంలో ఉన్న మహాలక్ష్మి మందిర్‌ దగ్గరకు వచ్చిన ఓ కోతి చనిపోయింది.



కోతికి అంత్యక్రియలు..
కోతి చనిపోయిన విషయాన్ని మహాలక్ష్మి మందిర్‌లో పూజారిగా పని చేస్తున్న మనమంతప్పస్వామి చూశారు. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. తుర్కపల్లికి చెందిన శివాలయస్వామితో పాటు గ్రామస్తులంతా ఒక్కటిగా చేరి కోతి అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలు ఎలా నిర్వహిస్తారో అదే విధంగా కోతికి అంత్యక్రియలను దగ్గరుండి పద్దతి ప్రకారం నిర్వహించారు.

Basara iiit : జాబ్‌ రూపంలో జాక్‌పాట్ .. అక్కడ చదివిన స్టూడెంట్‌కి 65లక్షల జీతం



వైరల్ అవుతున్న వార్త..
మనుషుల్లో మానవత్వం మచ్చుకైన కనిపించని ఈరోజుల్లో తుర్కపల్లికి చెందిన గ్రామస్తులు ఓ వానరాన్ని తమ కుటుంబ సభ్యుడిగా భావించి అంత్యక్రియలు నిర్వహించినట్లుగా తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు. వన్యప్రాణులు, మూగజీవాల పట్ల తుర్కపల్లి గ్రామస్తులు చూపించిన ఔదార్యానికి ఫిదా అయిపోయారు. ఇక ఈవార్త గ్రామంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరగడంతో అందరూ విచిత్రమైన కామెంట్స్‌ని షేర్ చేస్తున్నారు. ఆ ఊరోళ్లు చాలా మంచి వాళ్లు. మనుషులు కష్టాల్లో ఉంటేనే పట్టించుకోని ఈరోజుల్లో చనిపోయిన వానరాన్ని సొంత మనిషిగా భావించారు. మనిషికి నిర్వహించినట్లుగా అంత్యక్రియలు నిర్వహించి మూగజీవాలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Sangareddy, Telangana News, VIRAL NEWS

తదుపరి వార్తలు