ఆ బావి నీళ్లు సర్వరోగ నివారిణి.. బారులుదీరుతున్న జనం..

ప్రత్యేకత సంతరించుకున్న దూద్ బావి

దూద్ బావికి ఏళ్ల చరిత్ర ఉంది. ఈ బావి నీళ్లుకు ప్రత్యేకత ఉండడంతో ఏళ్ల తరబడి చాలా మంది ఇవే నీటిని తాగుతూ ఆరోగ్యంగా ఉన్నారు.

 • Share this:
  ఈ బావి నీళ్లు సర్వరోగ నివారిణి.. బారులుదీరుతున్న జనం..ప్రపంచ వ్యాప్తంగా రోజురోజూకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ నివారణకు ఇప్పటివరకు ఖచ్చితమైన మెడిసిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో వంటింటి చిట్కాలు, ఆయుర్వేదం విధానాల్లో కరోనా నివారణకు చిట్కాలు పాటించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఓ బావి నీళ్లు ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు.. రాతి గోడలు. పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు. ఆ బావి నీళ్లు తాగితే సర్వ రోగాలు తొలగిపోతాయనేది స్థానికుల నమ్మకం. ఈ నీళ్లు తాగడం వల్ల కరోనా నుంచి బయటపడతామని స్థానికులు విశ్వసిస్తున్నారు. దీంతో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి జనం భారీగా బారులుదీరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మొలంగూర్ అనే గ్రామంలో దూద్ బావికి ఏళ్ల చరిత్ర ఉంది.

  ఈ బావి నీళ్లుకు ప్రత్యేకత ఉండడంతో ఏళ్ల తరబడి చాలా మంది ఇవే నీటిని తాగుతూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నీటిలో ఖనిజ లవణాలు మెండుగా ఉండడంతో ఈ నీటిని తాగిన వారికి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ బావికి చుట్టుపక్కల మర్రి చెట్లు ఇంకా పురాతన రాతి గోడలు, చుట్టుపక్కల పెద్ద గుట్టలు ఉండడం విశేషం. గతంలో ఈ నీళ్లను ప్రభుత్వం పరీక్షలు చేయగా వీటిలో స్వచ్ఛమైన అధిక లవణాలు పోషక పదార్థాలు చాలా ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి ఈ గ్రామస్తులే కాకుండా ఇతర జిల్లా వాసులు కూడా ఈ నీటిని తీసుకెళ్తున్నారు.

  ఈ కరోనా సమయంలో ఈ నీటికి అధిక ప్రాధాన్యత సంచరించుకుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ నీటిని తాగి వెళ్తున్నారు.ఈ నీటిని తాగడం వల్ల కరోనా నుంచి బయట పడవచ్చని గ్రామస్తుల నమ్మకం. ఈ నీటిని చూస్తే పాలలాగే తెల్లగా మెరుస్తాయి. ఇంకా రుచిగా ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. ఏదిఏమైనా ఈ బావి మా ఉరిలో ఉండడం మా అదృష్టం అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Narsimha Badhini
  First published: