Isolation at burial ground :స్మశానంలో ఐసోలేషన్...! ఇక్కడే స్వేఛ్చ ఉందంటున్న గిరిజనులు..!

స్మశానంలో ఐసోలేషన్...! ఇక్కడే స్వేచ్చ ఉందంటున్న గిరిజనులు..!

Isolation at burial ground : గిరిజనం అంటేనే ప్రత్యేక జీవన విధానం...ప్రత్యేక కట్టుబాట్లు, ఇతరులకు బిన్నంగా సంప్రదాయాలు ఉంటాయి.. అయితే..తాజాగా ఆ విధానాన్నే కరోనాకు కూడా అప్లై చేశారు తెలంగాణ గిరిజనం. గ్రామానికి చెందిన 50మందికి కరోనా సోకడంతో ఏకంగా స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్నారు..అధికారులు వద్దని వారించినా..వారికి అక్కడే స్వేఛ్చగా ఉందంటున్నారు.

  • Share this:
దేశంలో ఎక్కడైనా గిరిజన సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి..దీంతో వారి జీవన విధానం కూడా ఒకరకమైన విశేషాలను కల్గి ఉంటుంది..చేసే పని నుండి తినే తిండి వరకు గిరిజనులు ప్రత్యేకతనే చాటుకుంటారు..అయితే ఈ ప్రత్యేకతను కోవిడ్ నుండి రక్షించుకోవడంలో కూడా చూపారు. కరోనా సోకడంతో అందరు ఐసోలేషన్ సెంటర్ల కోసం పరుగులు పెడుతున్నారు..పట్టణాల్లో వారు ప్రత్యేక ఇళ్లలోకి మారుతుండగా ఉన్నతవర్గాల వారు ప్రత్యేకంగా మరో ఇళ్లునే కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి..ఇక గ్రామాల్లో తమ పోలాల్లో , చెట్ల కింద ఉంటూ కరోనా నుండి బ్రతికి బయటపడుతున్నారు..

అయితే తెలంగాణలో ఓ గిరిజన గూడేం మాత్రం వింత ఆలోచనలకు తెరలేపింది..గ్రామంలో కరోనా సోకిన వారు మూకుమ్మడిగా గ్రామంలోని స్మశానాన్నిఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్నారు..సాముహికంగా వంటలు వండుకుంటూ...ఇతర గ్రామస్తుల సహాకారంతో బతుకు వెళ్లదీస్తున్నారు..అయితే స్మశానంలో ఎందుకని ప్రభుత్వ అధికారులు అడిగినా వారు మాత్రం స్మశానమే తమకు బెటర్ ఐసోలేషన్ సెంటర్ అంటూ చెబుతున్నారు..

వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మండలంలోని మొద్దులమడ అనే గిరిజన గ్రామం ఉంది..ఆ గ్రామంలో మొత్తం 150 మంది జనాభా ఉన్నారు. విశేషం ఎమిటంటే మొత్తం గ్రామ జనాభాలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది..దాదాపుగా ఇంటికి ఒకరు కరోనా భారిన పడ్డారు..

దీంతో ఇతరులకు వ్యాధి సోకకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నారు..ఇంతమందికి ఒకేసారి కరోనా రావడంతో ఎవరింట్లో ఉండే పరిస్థితి లేదు..దీనికితోడు వేల ఖర్చులు పెట్టుకుని ఇతర ప్రాంతాలకు ఐసోలేషన్‌ సెంటర్‌కు వెళ్లే అవకాశాలు లేకపోవడతో..తమ గ్రామంలోనే ఉన్న విశాలమైన స్మశానవాటికను ఐసోలేషన్ సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గత రెండు రోజులుగా అక్కడే ఉంటూ సాముహిక బోజనాలు చేసుకుని తింటున్నారు.

కాగా వీరికి తమ కుటుంబసభ్యులతో పాటు గ్రామపెద్దలు, రాజకీయ నాయకులు సహాయం చేస్తున్నారు. ఎవరికి తోచిన సహాయం వారు చేస్తుండడంతో విషయం జిల్లా కలెక్టర్‌కు చేరింది..దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ వారిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే గిరిజనం మాత్రం అందుకు అంగీకరించలేదు.తమకు స్మశానంలోనే బాగుందని బదులు చెప్పారు. అక్కడే స్వేచ్చగా ఉంటున్నామని తెలిపారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు..

కరోనా సోకిన వారు ఐసోలేషన్ వెళ్లే పరిస్థితి ఉండడం లేదు..దీంతో ఉన్న రెండు మూడు గదుల్లోనే కరోనా రోగులు తమ జీవనాన్ని బిక్కుబిక్కుమంటూ వెల్లదీస్తున్నారు..దీంతో కరోనా వ్యాప్తిచెందడానికి మరింత కారణమవుతోంది. ఈ క్రమంలోనే ఇటివల నల్గోండ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇంట్లో సరైన సౌకర్యం లేకపోవడంతో ఇంటి ముందు ఉన్న చెట్టుమీద ఉన్నాడు..అయితే మీడియాలో రావడంతో ఆయువకున్ని స్థానిక మండల కేంద్రంలోని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక మరికొంది మాత్రం ఇంటిబయట బాత్రూంలలో కూడా ఉంటున్న దీన స్థితి కనిపిస్తోంది..ఏది ఎమైనా ఇలాంటీ పరిస్థితి ఎదురుకాకుండా స్థానిక ప్రభుత్వం అధికారులు గ్రామాల్లో పర్యటిస్తే...పునారావృతం కాకుండా ఉంటాయి..
Published by:yveerash yveerash
First published: