Nizamabad: భూమి ఇవ్వనందుకు దళితులకు వేధింపులు.. వీడీసీ నిర్వాకం.. రంగంలోకి పోలీసులు

గ్రామంలో విచారణ చేపడుతున్న పోలీసులు

Nizamabad: వీడీసీ అంటే గ్రామంలోని అన్ని కులాల సంఘ‌ల‌కు సంబందించిన ఒక‌ స‌భ్యుడు ఉంటారు. కానీ మంచి కోసం ఏర్పాటు చేసిన క‌మిటీలను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు.

 • Share this:
  (P.Mahendar, Nizamabad, News18)

  పచ్చని పల్లెల్లో ఒకరికి క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు తోడుగా మేమున్నామని భరోసాగా నిల‌బ‌డేవారు. క‌లిసి క‌ట్టుగా ఉంటూ గ్రామంలో కుల‌మాతాల‌కు అతీతంగా కలిసి ఉండేవారు. కానీ గ్రామాభివృద్ది క‌మిటీలు ఎప్పుడైతే ఏర్పాటు అయ్యాయో ఆనాటి నుంచి ప‌ల్లెల్లో బంధాలు క‌నిపించ‌డం లేదు. వీడీసీ(విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ) ఓ నియంతాలాగా మారిపోయింది. వారు చెప్పిందే వేదం. చేసిందే చ‌ట్టం అన్నట్టుగా తయారైంది. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వీడీసీ ఆగ‌డాలకు సామాన్యులు బ‌ల‌వుతున్నారు. నిజామాబాద్ రూర‌ల్, ఆర్మూర్, బాల్కొండ నియోజ‌వ‌ర్గాల్లో వీడీసీలు రెచ్చిపోతున్నాయి. వారు చేప్పిన మాట విన‌కపోతే వారిపై సామాజిక బహిష్కరణ వేటు వేస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు వారిని మానసికంగా దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు తరచూ వెలుగు చూస్తున్నాయి.

  తాజాగా దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ గ్రామములో దళిత సంఘం వారు వారి తాతల నాటి పెంటకుప్పల స్థలాన్ని చదును చేసి సంఘం కొరకు కళ్యాణమండపం కట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ స్థలం గ్రామానికి చెందిందని.. గ్రామ అవసరాలకు ఉప‌యోగించేందుకు తమకు ఇవ్వాలంటూ విడిసి స‌భ్యులు దళితులకు(Dalits) చెప్పారు. అయితే తమ స్థలం వీడీసీకి ఇచ్చేందుకు వాళ్లు నిరాకరించారు. చిన్నగా శుభకార్యాలు చేసుకునేందుకు రేకుల షెడ్డు వేసుకొని సంఘం క‌డతామని వీడీసీకి తెలిపారు. అయితే వీడీసీ సభ్యులు దళితుల సంఘం నుంచి వీడీసీకి వచ్చే దళితసభ్యుడిని స‌మావేశాల‌కు రావద్దని మెలిక పెట్టారు. ఆ స్థలం విడిసికి ఇస్తే రావాలి లేకపోతే లేదనడంతో వారు వీడీసీ సమావేశాలకు దూరంగా ఉండిపోయారు.

  శుభ, ఆశుభ కార్యాలకు గ్రామంలో ఎవరూ ద‌ళితుల‌ను డ‌ప్పు కొట్టేందుకు పిల‌వ‌కూడదని లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు. దీంతో గ్రామంలోని వారంతా మాదిగలకు డప్పు కొట్టేందుకు పిలవడం మానేశారు. అయినా సరే అని వాళ్లు సర్దుకుపోయారు. అయితే వారిని మరింతగా ఇబ్బందిపెట్టేందుకు వారి పంటను ఎవరూ కోయకూడదని వరి కోతమిషిన్ యజమానులకు హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. గ్రామంలో గత 15 రోజులుగా కోతలు మొదలయ్యాయి. అయినా దళితుల పొలాలు కోసేందుకు ఎవ్వరు ముందుకు రావడంలేదు. వీరి పొలం గట్టుకు పక్కనే ఉన్న ఇతరుల పొలాలు కోసి వెళ్లిపోతున్నారని ద‌ళితులు వాపోతున్నారు. తమ పొలం ఏందుకు కోయడంలేదని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. వీడీసీ వాళ్లు హుకుం వల్లే తాము మీ పొలంలోని వరి కోయడంలేదని దళితులకు హ‌ర్వేస్టర్ యాజ‌మానులు తెలిపారు.

  దీంతో తమ కష్టాన్ని, తమకు జరుగుతున్న నష్టాన్ని వాళ్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండురోజులుగా సీఐ శ్రీశైలం వీడీసీ సభ్యులతో చర్చించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఏసీపీ రంగంలోకి దిగారు. పలువురిపై కేసు నమోదు చేశారు. దళిత రైతుల (Farmers) పంట పొలాల్లోని వరిని తాము దగ్గరుండి కోయిస్తామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిని ఇబ్బందిపెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని అన్నారు.

  Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

  Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

  వీడీసీ అంటే గ్రామంలోని అన్ని కులాల సంఘ‌ల‌కు సంబంధించిన ఒక‌ స‌భ్యుడు ఉంటారు. గ్రామంలో ఏదైన అభివృద్ది ప‌నులు చేసేందుకు నిర్ణయం తీసుకుంటే ఆ విష‌యం కుల స‌భ్యుల‌కు తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మంచి కోసం ఏర్పాటు చేసిన క‌మిటీలను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు స్పందించినప్పటికీ.. ప్రజాప్రతినిధులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: