Home /News /telangana /

VIKARABAD MINOR GIRL MURDER CASE ACCUSED ARRESTED VRY

Vikarabad : బాలిక హత్య కేసులో ముందే స్కెచ్.. మూకుమ్మడి అత్యాచారం..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vikarabad : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే... అయితే మైనర్ బాలిక హత్యకు వెనక పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది... తాగిన మైకంలో ముందుగానే పిలిపించి అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

ఇంకా చదవండి ...
    వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో సోమవారం దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే... గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైందన్న సమాచారంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. హత్య వెనక ప్రేమ వ్యవహారం ఉందని ప్రచారం జరిగింది. బహిర్భూమికి అని వెళ్లిన బాలిక హత్యకు గురవడం విషాదాన్ని నింపింది.

    అయితే హత్యకు గురైన బాలికపై అత్యాచారం, ఆతర్వాత హత్య ఓ పథకం ప్రకారమే జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మాయిని ఒంటరిగా పిలిచి అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం అరెస్ట్ చేసిన వారిలో మహెందర్ అనే వ్యక్తి హత్యకు గురైన ఇంటికి సమీపంలోనే కొత్త ఇళ్లు నిర్మాణం చేశాడు. ఇళ్లు పూర్తి కావడంతో స్నేహితులను పిలిచి ఆదివారం రాత్రి పార్టీ ఇచ్చాడు.

    Siddipet : విషపు ఇంజక్షన్లతో కుక్కలను చంపించిన సర్పంచ్.. మేనకా గాంధీకి ఫిర్యాదు...

    ఈ క్రమంలోనే అప్పటికే హతురాలు పరిచయం ఉండడంతో ముందుగానే సోమవారం తెల్లవారుజామున ఆమెను పిలిపించినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిర్మానుష్యప్రాంతానికి చేరుకున్న బాలికపై ఒక్కరే అత్యాచారం చేశారా.. లేక సాముహిక అత్యాచారం చేశారా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. అత్యాచారం సంధర్భంలో బాలిక వ్యతిరేకించినందుకే అలా చేశారా అనే కోణంలో కూడా పోలీసుల విచారణలో తేలనున్నట్టు చెబుతున్నారు. హత్యకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Vikarabad district

    తదుపరి వార్తలు