వికారాబాద్ జిల్లా(Vikarabad) మర్పల్లి మండలంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్రుతి, చిన్నారి త్రిషాంత్, కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి(Raghavender Reddy) రావులపల్లికి కారులో బయలుదేరారు. అయితే గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు తిమ్మాపూర్ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహించసాగింది.
అయితే చిన్నవాగే కదా అని కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి వాహనాన్ని వాగు దాటించే ప్రయ త్నం చేశాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. పెళ్లి కొడుకు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్ తెరిచి కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు. అయితే నవ వధువు ప్రవల్లిక, వరుడు నవాజ్‌రెడ్డి రెండో అక్క శృతి, బాలుడు నీటిలో కొట్టుకుపోయారు.
మొబైల్ విషయంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ.. అయ్యో ఎంత ఘోరం జరిగిందంటే..
దీంతో వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) సోమవారం ఉదయమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కాలినడకన ఎస్పీతో కలిసి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రవలిక మృతదేహాన్ని ట్రాక్టర్ వద్దకు చేర్చటానికి.. స్వయంగా ఎమ్మెల్యే మోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. ప్రవల్లిక, శ్రుతి మృతదేహాలు ఆచూకీ దొరకడంతో.. స్వయంగా పాడెకట్టి, ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే ఆనందర్ పరామర్శించారు. ఇక, మోమిన్‌పేట(Mominpet) లో కుటుంబ సభ్యులు ప్రవలిక అంత్యక్రియలు నిర్వహించారు. ప్రవల్లిక పెళ్లి దుస్తుల్లోనే విగత జీవిగా కనిపించడం కుటుంబ సభ్యులను , బంధువులను కంటతడి పెట్టించింది.
బెంగళూరులో పనిచేస్తున్న ఆంధ్ర యువతి.. ప్రతి రోజులాగే ఉద్యోగానికి బయలుదేరింది.. కానీ ఇంతలోనే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.