హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News: లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులోనే బాలికపై లైంగిక దాడి.. నమ్మించి మోసం చేసిన కామోన్మాది

Crime News: లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులోనే బాలికపై లైంగిక దాడి.. నమ్మించి మోసం చేసిన కామోన్మాది

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Crime News: వికారాబాద్ జిల్లాలో బాలికపై కారులో అత్యాచారం, నమ్మించి ఓ బాలిక గొంతు కోశాడో కామాంధుడు. స్కూల్‌ తరపున విహారయాత్రకు వెళ్లి వచ్చిన బాలికను కారులో ఇంటి దగ్గర దింపుతానని చెప్పి మార్గం మధ్యలోనే బాలికపై కామవాంఛ తీర్చుకున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Rangareddy, India

(Syed Rafi, News18,Mahabubnagar)

నిత్యం ఏదో ఓ చోట అమ్మాయిలు, పసివాళ్లపై కామాంధులు తమ కామవాంఛ తీర్చుకునేందుకు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వికారాబాద్ (Vikarabad)జిల్లా యాలాల(Yalala) మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ పసి మొగ్గపై అదే మండలానికి చెందిన ఓ కామాంధుడు లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 14వ తేదీన ఈ దారుణం జరిగితే బాలిక పడుతున్న మనోవేదన అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఏం జరిగిందో నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. పసిమొగ్గపై కామవాంఛ తీర్చుకున్న మృగాడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

లిఫ్ట్ పేరుతో మోసం..

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ పసిమొగ్గపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఫిబ్రవరి 14న పాఠశాల నుండి విహారయాత్రకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ పసి మొగ్గ ముఖంలో సంతోషం ఎక్కువసేపు ఉండలేదు. విహార యాత్ర నుండి తిరిగి పాఠశాలకు చేరుకోవడానికి రాత్రి 11 గంటల సమయం పట్టింది. ఎక్కువ సమయం కావడంతో ఉపాధ్యాయులు సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఎవరి పిల్లలను వారు తీసుకెళ్లారు. ముగ్గురు విద్యార్థినిలు పాఠశాల ఆవరణలోనే పాఠశాల ఉపాధ్యాయులతో మిగిలిపోయారు.

పదేళ్లలోపు బాలికపై అఘాయిత్యం..

అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి ఉపాధ్యాయులతో మాట కలుపుతూ మిగిలిన ముగ్గురు విద్యార్థులను కారులో గ్రామంలో వదిలేస్తానని నమ్మబలికాడు. దీంతో ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి కదా అని నమ్మి విద్యార్థులను కారులో పంపించడం జరిగింది. దారిలో వచ్చే ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను వదిలిపెట్టిన కామాంధుడు కారులో ఒంటరిగా మిగిలిన మరో బాలికపై కారులోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Sad News: 65సంవత్సరాలు కలిసి జీవించిన అన్నదమ్ములు .. ఆ పనికి వెళ్లి ప్రాణాలొదిలారు

పరారీలో కామాంధుడు..

ఈ దారుణ సంఘటన జరిగిన తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన దారుణాన్ని మనసులో దిగ మింగుతూ నాలుగు రోజులుగా తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురైంది. కావడంతో బిడ్డలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఏమి జరిగిందని ఆరా తీయడంతో అశలు నిజం బయటపడింది. తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు సోమవారం యాలాల పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కామాంధుడు పరారీలో ఉన్నాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

First published:

Tags: Child rape, Telangana crime news, Vikarabad

ఉత్తమ కథలు