విన్నారా.. రాములమ్మకు 22 ఏళ్లంట.. ట్విట్టర్‌లో విజయశాంతి కృతజ్ఞతలు..

అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చి.. లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ఆపై రాజకీయాల్లోకి వచ్చి.. ఎంపీగా, తెలంగాణ ఉద్యమనాయకురాలిగా కీర్తి గడించారు విజయశాంతి. అలాంటి విజయశాంతికి అప్పుడే 22 ఏళ్లు నిండిపోయాయట. ఆమే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ విషయమేమిటంటారా?

news18-telugu
Updated: January 26, 2019, 7:49 PM IST
విన్నారా.. రాములమ్మకు 22 ఏళ్లంట.. ట్విట్టర్‌లో విజయశాంతి కృతజ్ఞతలు..
విజయశాంతి ఫైల్ ఫోటో..
  • Share this:
అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చి.. లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ఆపై రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా, తెలంగాణ ఉద్యమనాయకురాలిగా కీర్తి గడించారు విజయశాంతి. అలాంటి విజయశాంతికి అప్పుడే 22 ఏళ్లు నిండిపోయాయి.  1979లో తొలిసారి హీరోయిన్‌గా కెమెరా ముందుకొచ్చిన విజయశాంతి 1983లో వచ్చిన నేటిభారతం సినిమాతో తొలి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎన్నో జనరంజక పాత్రల్లో నటించి మెప్పించారు. అటు సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఇటు గ్లామరస్ గాళ్‌గా ప్రేక్షకులను అలరించిన ఘనత ఆమె సొంతం.

veteran actress vijayashanti, heroin vijayashanti, lady superstar vijayashanti, congress leader vijayashanti, ex mp vijayashanti, vijayashanti with kcr, kcr vijayashanti, vijayashanti chiranjeevi, chiranjeevi vijayashanti, హీరోయిన్ విజయశాంతి, నటి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కాంగ్రెస్ నేత విజయశాంతి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ ఎంపీ విజయశాంతి, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, కేసీఆర్‌తో విజయశాంతి, కేసీఆర్ విజయశాంతి, విజయశాంతి చిరంజీవి
చిరంజీవి, విజయశాంతి ఫైల్ ఫోటోలు

అప్పటికే పరిశ్రమలో శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్ల హవా కొనసాగుతున్న వేళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి విజయశాంతి.. విజయవంతంగా కెరీర్‌ను సాగించారు. కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సహా ఇండస్ట్రీలోని అగ్రహీరోలందరితోనూ ఆమె నటించారు. చిరంజీవితో కలిసి ఆమె నటించిన చాలాచిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం లేడీ ఓరియంటడ్ పాత్రలకే ఆమె ప్రాధాన్యతనిచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే.. పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆద్యురాలు ఆమేనని చెప్పొచ్చు. తెలుగు సినిమా రాములమ్మగా గుర్తింపు పొందిన విజయశాంతి దాదాపు 2 దశాబ్దాల పాటు తన హవా కొనసాగించారు.

veteran actress vijayashanti, heroin vijayashanti, lady superstar vijayashanti, congress leader vijayashanti, ex mp vijayashanti, vijayashanti with kcr, kcr vijayashanti, vijayashanti chiranjeevi, chiranjeevi vijayashanti, హీరోయిన్ విజయశాంతి, నటి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కాంగ్రెస్ నేత విజయశాంతి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ ఎంపీ విజయశాంతి, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, కేసీఆర్‌తో విజయశాంతి, కేసీఆర్ విజయశాంతి, విజయశాంతి చిరంజీవి
కేసీఆర్‌తో విజయశాంతి ఫైల్
సినిమాలకు దూరమయ్యాక.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు విజయశాంతి. తర్వాత దాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి.. ఎంపీగా గెలుపొంది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి ఢిల్లీస్థాయిలో పోరాటం చేశారు. ఇంతటి సుదీర్ఘ సినిమా, రాజకీయ కెరీర్ కలిగిన విజయశాంతికి 22 సంవత్సరాలేమిటి అని అనుకుంటున్నారా? ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఈ జనవరి 26కు 22 ఏళ్లవుతోందన్నమాట.

veteran actress vijayashanti, heroin vijayashanti, lady superstar vijayashanti, congress leader vijayashanti, ex mp vijayashanti, vijayashanti with kcr, kcr vijayashanti, vijayashanti chiranjeevi, chiranjeevi vijayashanti, హీరోయిన్ విజయశాంతి, నటి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కాంగ్రెస్ నేత విజయశాంతి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ ఎంపీ విజయశాంతి, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, కేసీఆర్‌తో విజయశాంతి, కేసీఆర్ విజయశాంతి, విజయశాంతి చిరంజీవి
విజయశాంతి ఫైల్

సామాజిక దృక్పథంతో కూడిన అనేక సినిమాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న విజయశాంతి.. ప్రజాసేవ చేసేందుకు 1998 జనవరి 26న తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి నిర్విరామంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
veteran actress vijayashanti, heroin vijayashanti, lady superstar vijayashanti, congress leader vijayashanti, ex mp vijayashanti, vijayashanti with kcr, kcr vijayashanti, vijayashanti chiranjeevi, chiranjeevi vijayashanti, హీరోయిన్ విజయశాంతి, నటి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కాంగ్రెస్ నేత విజయశాంతి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ ఎంపీ విజయశాంతి, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, కేసీఆర్‌తో విజయశాంతి, కేసీఆర్ విజయశాంతి, విజయశాంతి చిరంజీవి
పార్లమెంటులో విజయశాంతి ఫైల్

2009 ఎన్నికలకు ముందు తన పార్టీని కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీలోవిలీనం చేశారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కేసీఆర్‌తో కలిసి తెలంగాణ కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశారు. తెలంగాణ వచ్చాక పలు కారణాలతో ఆమె టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

veteran actress vijayashanti, heroin vijayashanti, lady superstar vijayashanti, congress leader vijayashanti, ex mp vijayashanti, vijayashanti with kcr, kcr vijayashanti, vijayashanti chiranjeevi, chiranjeevi vijayashanti, హీరోయిన్ విజయశాంతి, నటి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కాంగ్రెస్ నేత విజయశాంతి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ ఎంపీ విజయశాంతి, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, కేసీఆర్‌తో విజయశాంతి, కేసీఆర్ విజయశాంతి, విజయశాంతి చిరంజీవి
రాహుల్ గాంధీతో విజయశాంతి ఫైల్

తాను రాజకీయాలలో వచ్చి నేటితో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు విజయశాంతి. తనను లేడీ సూపర్ స్టార్‌గా ఆదరించిన ప్రజలకు సేవలందించేందుకు సరిగ్గా 22 ఏళ్ల క్రితం, 1998 జనవరి 26న తల్లి తెలంగాణ పార్టీని స్థాపించానని ట్వీట్‌లో పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభించి నేటికి సరిగ్గా 22 ఏళ్లు అని అన్నారు.

First published: January 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading