GHMC Elections: ఇది ప్రభుత్వ వ్యూహాత్మక కుట్ర.. పోలింగ్ తగ్గడంపై రాములమ్మ ఫైర్

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై విజయశాంతి ఫైర్ అయ్యారు.

news18
Updated: December 1, 2020, 8:11 PM IST
GHMC Elections: ఇది ప్రభుత్వ వ్యూహాత్మక కుట్ర.. పోలింగ్ తగ్గడంపై రాములమ్మ ఫైర్
విజయశాంతి (ఫైల్)
  • News18
  • Last Updated: December 1, 2020, 8:11 PM IST
  • Share this:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోవడంపై అందరిలోనూ సందేహాలు రేకెత్తుతున్నాయి. వరుస సెలవురు రావడం.. నగరంలో ఎక్కువ మంది ఉండకుండా చేసి.. లబ్ది పొందాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటింగ్ శాతం కనీసం పాస్ మార్కులైనా దాటలేదు. హైదరాబాదీలు ఓటెయ్యడమంటే అదేదో తమకు సంబంధం లేని విషయంగా వ్యవహరించారు. అయితే దీని వెనుక ప్రభుత్వ కుట్ర కూడా ఉన్నదని ప్రముఖ నటి.. ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు.. త్వరలోనే బీజేపీలో అధికారికంగా చేరబోతున్న రాములమ్మ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Facebookలో రాములమ్మ చేసిన కామెంట్స్ యథాతథంగా.. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ... ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వరుస సెలవులు ఉన్నాయని తెలిసీ, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసీ... ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఓటరు నమోదు, ఓటరు జాబితాల్లో తగిన మార్పు చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరిచేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా కేవలం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేం. ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. నేటి ఎన్నికల్లో చాలా చోట్ల స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ అనేకమంది ఓటర్లు నిరాశతో వెనుదిరగడం చూస్తే ఈ ఆరోపణలు నిజమని నమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితి ఓటర్లను నిరాశకు గురిచేసి పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసింది. ఇది గాక, చాలా పోలింగ్ బూత్‌‌లలో కోవిడ్ సన్నద్ధత కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇది కూడా ఓటర్లను భయపెట్టింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆరెస్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైంది..’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.ఇదిలాఉండగా.. ఓటింగ్ తక్కువగా నమోదుకావడంపై నగర సీపీ సజ్జనార్ కూడా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆయన స్పందిస్తూ... ‘గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం బాధగా ఉంది. ఓటు హక్కు కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో అది ఎక్కడా కనిపించలేదు. ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాలంటే లక్షల్లో జనాలు ముందుకు వస్తారు. అదే ఓటు వేయాలంటే మాత్రం కనిపించడం లేదు. పోలింగ్ విషయంలో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కొత్త ఆలోచన చేయాలి. విద్యార్థులకు సీట్లు పొందాలన్నా, సర్టిఫికెట్ తీసుకోవాలన్న కచ్చితంగా ఓటు వేసి ఉండాలన్న నిబంధన పెట్టాలి. ఓటు వేసిన వ్యక్తులకే విద్య, ఉద్యోగ అకాశాలు కల్పించాలి. చివరికి మంచి నీటి కనెక్షన్ పొందాలన్నా సరే ఓటు వేసి ఉండాలన్న నిబంధనను తేవాలి. ఓటువేసిన వారికే ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుంది.' అని సజ్జనార్ తెలిపారు.
Published by: Srinivas Munigala
First published: December 1, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading