Home /News /telangana /

VIJAY MEETS CM KCR HERE IS THE REAL REASON FOR THE MEETING BETWEEN JOSEPH VIJAY AND CM KCR IN PRAGATHI BHAWAN HYDERABAD SK

CM KCR-Vijay: సీఎం కేసీఆర్‌ని విజయ్ ఎందుకు కలిశారు? తెర వెనక ఇంత పెద్ద వ్యూహముందా?

Vijay meets kcr Twitter

Vijay meets kcr Twitter

CM KCR-Vijay: బుధవారం తమిళ్ సినిమా హీరో విజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఎందుకు కలిశారు? ఇది మర్యాదపూర్వక భేటీయేనా? ఇంకేదైనా కారణముందా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

    బుధవారం తమిళ స్టార్ హీరో విజయ్ (Tamil Hero Vijay) ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను కలిసిన విషయం తెలిసిందే. హీరో విజయ్‌తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వీరిద్దరిని సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ను సీఎం కేసీఆర్ (Actor Vijay Meets CM KCR) శాలువాతో సన్మానించారు. ఆప్యాయంగా పలుకరించి తన సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఐతే వీరిద్దరు కలుస్తారని ఎవరూ అనుకొని ఉండరు. కానీ అనూహ్యంగా హీరో విజయ్‌ని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు? సీఎం కేసీఆర్‌ని ప్రగతిభవన్‌లో ఎందుకు కలిశారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు వీరిద్దరు భేటీ కావడానికి కారణమేంటని జోరుగా చర్చ జరుగుతోంది.

    ప్రస్తుతం హీరో విజయ్ ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఆయన తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు డెరెక్టర్, నిర్మాతలే ఆ మూవీకి పనిచేస్తున్నారు. హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యంలోనే హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు. ఆ పనులు పూర్తైన తర్వాత ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఐతే అక్కడికి వెళ్లి సీఎం కేసీఆర్‌ను ఎందుకు కలిశారన్నదనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనక అసలు కథ వేరే ఉందని ప్రచారం జరుగుతోంది.

    యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్​.. తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన మరో అంతర్జ

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారు. అప్పుడప్పుడూ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుస్తుంటారు. నిన్న కూడా ప్రశాంత్ కిశోర్ ప్రగతి భవన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌ను కలిసేందుకే హీరో విజయ్ అక్కడికి వెళ్లారని సమాచారం. మొదట సీఎం కేసీఆర్ ‌ను కలిసి తర్వాత.. దాదాపు రెండు గంటలకు పైగా అక్కడే ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు జరిపారట. గతంలో కూడా పలు మార్లు హైదరాబాద్‌కు వచ్చిన విజయ్.. రెండు సార్లు ప్రశాంత్ కిశోర్‌ని కలిసినట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి ఆయనతో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన రాజకీయ పార్టీని పెట్టబోతున్నారని.. దాని గురించి చర్చించేందుకే పీకేను విజయ్‌ని కలిసినట్లు సమాచారం.

    ప్రకాశ్ రాజ్‌ విషయంలో మళ్లీ కన్ఫ్యూజన్.. టీఆర్ఎస్‌లో ఆయన పాత్ర తేల్చని కేసీఆర్ ?

    తమిళనాడులో జోసెఫ్ విజయ్ ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్నారు. రజినీకాంత్ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకుంది. ప్రజల్లోనూ మంచి పేరుంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారని గతంలో ప్రచారం జరిగింది. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత.. విజయ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ వార్తలను విజయ్ ఖండిస్తూ వచ్చారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని.. త్వరలోనే ఆయన పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సొంతంగా పార్టీ పెట్టి 2026 ఎన్నికల్లో పోటీచేయాలని విజయ్ భావిస్తున్నారట. కొత్త పార్టీ ఏర్పాటు సంబంధించి పీకే నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారట. ఈ క్రమలోనే ప్రగతిభవన్‌లో ఉన్న పీకేను కలిసేందుకు విజయ్ వెళ్లారని సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Hyderabad, Tamil actor vijay, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు