కేరళ వరద బాధితులకు ‘అర్జున్ రెడ్డి’ విరాళం

విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ తన ఫస్ట్ ఆప్షన్‌గా చెప్పిన విజయ్ దేవరకొండ, విపత్కర పరిస్థితుల్లో ఉన్న కేరళ ప్రజలకు బాసటగా నిలుస్తూ విరాళం పంపుతున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: August 12, 2018, 9:24 PM IST
కేరళ వరద బాధితులకు ‘అర్జున్ రెడ్డి’ విరాళం
విజయ్ దేవరకొండ(ఫైల్ ఫోటో)
  • Share this:
సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే సినీ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’ నటనకు గానూ విజయ్‌కు వచ్చిన ఫిలింఫేర్‌ అవార్డ్‌ను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేశాడు. ఆ అవార్డును వేలం వేయగా వచ్చిన 25లక్షలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ వరద బాధితులకు తన వంతు సాయాన్ని ప్రకటించాడు.

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తుతున్నాయి. ప్రకృతి విలయతాండవానికి పలువురు మృతి చెందగా...వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళలోని ఇడుక్కి సహా పలు జిల్లాల్లో నీట మునిగాయి. విరాళాలిచ్చి కేరళా వరద బాధితులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పిలుపునిచ్చారు. కేరళా సీఎం పిలుపు మేరకు ఇప్పటికే కోలీవుడ్‌ నుంచి కమల్ హాసన్, విశాల్‌, విజయ్, సూర్య, కార్తీలు కేరళా ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. కమల్ హాసన్ రూ.25 లక్షల విరాళం ప్రకటించగా, సూర్య, కార్తిలు కలిసి రూ.25 లక్షలు ప్రకటించారు.

టాలీవుడ్‌ నుంచి విజయ్‌ దేవరకొండ తన వంతు సహాయంగా ఐదు లక్షల రూపాయల్ని విరాళంగా ఇచ్చేశారు. కేరళతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ తన ఫస్ట్ ఆప్షన్‌గా చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న కేరళ ప్రజలకు బాసటగా నిలుస్తూ రూ.5 లక్షల విరాళం ఇస్తున్నానని,  తన అభిమానులు కూడా కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని విజయ్  పిలుపునిచ్చారు.
కాగా తన లేటెస్ట్ మూవీ 'గీత గోవిందం' రిలీజ్ కావడానికి ముందే లీక్ కావడంతో విజయ్ ఎమోషనల్ అవుతున్నాడు. ఇలాంటివి జరిగినపుడు చాలా బాధేస్తుందని, ఇలాంటి పరిస్థితి ఏ హీరోకూ, నిర్మాతకు రాకూడదన్నారు.
Published by: Janardhan V
First published: August 12, 2018, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading