Hyderabadలో వర్షానికి హోర్డింగ్ పడి ఇద్దరు చనిపోయారా? ఏది నిజం?

భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఓ హోర్డింగ్ బిల్‌బోర్డ్ ఊడిపడి ఇద్దరు చనిపోయారని ప్రచారం జరుగుతోంది. బైక్‌లపై పడడంతో వారు అక్కడికక్కడే మరణించారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: August 10, 2020, 7:23 PM IST
Hyderabadలో వర్షానికి హోర్డింగ్ పడి ఇద్దరు చనిపోయారా? ఏది నిజం?
హైదరాబాద్‌‌లో వర్షానికి హోర్డింగ్ పడి ఇద్దరు చనిపోయారా? ఏది నిజం?
  • Share this:
హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో నగరవాసులు ఇక్కట్లు పడుతున్నారు. ఐతే భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఓ హోర్డింగ్ బిల్‌బోర్డ్ ఊడిపడి ఇద్దరు చనిపోయారని ప్రచారం జరుగుతోంది. గాల్లో ఎగురుతూ వచ్చి నేరుగా బైక్‌లపై పడడంతో.. వారు అక్కడికక్కడే మరణించారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో వర్ష బీభత్సం ఇలా ఉందంటూ చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐతే ఇందులో నిజం లేదు. ఇది హైదరాబాద్‌లో జరగలేదు. అసలు మనదేశంలోనే కాదు.



ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు ఈ నెల ప్రారంభం నుంచే యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. Daily Dose Of Chaos అనే యూట్యూబ్ ఛానెల్‌ ఇది పాకిస్తాన్‌లో జరిగినట్లు పేర్కొంది. సో.. ఇది హైదరాబాద్‌లో జరిగిందన్న ప్రచారంలో నిజం లేదు.
Published by: Shiva Kumar Addula
First published: August 10, 2020, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading