హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sangareddy:  ఆసుపత్రిలో ట్రైనింగ్​కి వచ్చిన ఏఎన్​ఎంను కామ కోరిక తీర్చాలన్న సూపరింటెండెంట్​....  ఏఎన్​ఎం ఏం చేసిందంటే..

Sangareddy:  ఆసుపత్రిలో ట్రైనింగ్​కి వచ్చిన ఏఎన్​ఎంను కామ కోరిక తీర్చాలన్న సూపరింటెండెంట్​....  ఏఎన్​ఎం ఏం చేసిందంటే..

ఆసుపత్రి సూపరిటెండెంట్​కు దేహశుద్ది చేస్తున్న బాధితురాలి కుటుంబ సభ్యులు

ఆసుపత్రి సూపరిటెండెంట్​కు దేహశుద్ది చేస్తున్న బాధితురాలి కుటుంబ సభ్యులు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ లో సూపరిటెండెంట్​ గా పనిచేస్తున్న డాక్టర్ నర్సింగ్ చౌహన్ హాస్పిటల్ లో ట్రెనింగ్ కు వచ్చిన ఓ ఏఎన్ఎం పై కన్నేశాడు. హాస్పిటల్ కు ట్రెనింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుండగా ఆ ఏఎన్ఎం ను తన దగ్గరకు రావాలని పిలువడంతో ఆమె వెళ్లింది.

ఇంకా చదవండి ...

ఆసుపత్రిలో ట్రైనింగ్ (Training in hospital)​కి వచ్చిన ఏఎన్ఎం పై సూపరింటెండెంట్ (Superintendent)​ కన్ను పడింది. ఆ ఏఎన్ఎం తో కామ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు ఆ సూపరింటెండెంట్. తన ఛాంబర్ కు పిలిచి తన కోరిక తీర్చాలనీ వేధించాడు . దీంతో ఆ ఏఎన్ఎం (ANM) భయపడి తన కుటింబీకులకు విషయం చెప్పింది. కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు  సూపరింటెండెంట్​కు  దేహ శుద్ది చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఏరియా హాస్పిటల్ లో..

సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ (NarayanKhed) ఏరియా హాస్పిటల్ (area hospital) లో సూపరిటెండెంట్​ గా పనిచేస్తున్న డాక్టర్ నర్సింగ్ చౌహన్.. (Dr. Nursing Chauhan) లో ట్రైనింగ్​కి వచ్చిన ఓ ఏఎన్ఎం పై కన్నేశాడు. హాస్పిటల్ కు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుండగా ఆ ఏఎన్ఎం ను తన దగ్గరకు రావాలని పిలవడంతో ఆమె వెళ్లింది. ఈ క్రమంలో తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు ఆ కామాంధుడు. దీంతో విషయాన్ని ఆమె కుటింబీకులకు (Family members) తెలిపింది. వారు హాస్పిటల్ కు చేరుకొని డాక్టర్ ను దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు వాపోతుంది.

ఏమైనా హెల్ప్​ చేస్తావా..

కాగా, బాధిత ఏఎన్​ఎం కథనం ప్రకారం..  ఏఎన్​ఎం (ANM) ఇంటికి వెళ్లే సమయంలో సూపరిటెండెంట్​ పిలిచారని.. ఆయన పిలవడంతో మాట్లాడటానికి వెళ్లానని తెలిపింది. ఎందుకు వెళ్లిపోతున్నావ్​ అని అడగడంతో తనకు బస్ టైమ్​ అయిపోతుందని సూపరిటెండెంట్​కు సదరు ఏఎన్​ఎం తెలిపింది. అయితే సూపరిటెండెంట్ (Superintendent)​.. ఏమైనా హెల్ప్​ చేస్తావా అని అడిగాడని మహిళ పేర్కొంది. నేనేమీ చేయలేనని కావాలంటే మా అమ్మ, మా అన్నయ్యతో కలిసి వస్తానని సూపరింటెండెంట్​కు తెలిపింది. అవేం వద్దు కానీ... నీ దగ్గరినుంచి నాకు ఏమైనా హెల్ప్​ చేస్తావా అని సూపరింటెండెట్​ అడిగాడు. దీంతో ఆమె డబ్బులు కావాలంటే ఇస్తానని.. మా అన్నయ్యతో కలసి వస్తానని మరోసారి తెలిపింది. సూపరిటెండెంట్​ స్పందిస్తూ సర్టిఫికెట్​కు నువ్వు డబ్బులు అయితే ఇస్తావ్​.. కానీ, నువ్వు నాకు ఏం హెల్ప్​ చేస్తావ్​ అని అడిగాడు.

కోపోద్రిక్తుడైన సూపరింటెండెంట్​..

మహిళ బదులిస్తూ నేను ఏం చేయలేను సార్.. నాతో ఏం కాదు అంటే.. సూపరింటెండెట్​ మళ్లీ మళ్లీ అడగడంతో.. నేను ఏం చేయలేను.. ఆలోచించి మళ్లీ వచ్చి చెబుతా సార్​.. అని ఆయన నంబర్​ ఏఎన్ఎం (ANM) తీసుకుంది. రేపు మార్నింగ్​ వచ్చి కలుస్తా సార్​ అని ఏఎన్​ఎం బదులిచ్చింది. బయట ఉన్న తన బ్యాగు ఫోన్​ తీసుకోగానే సూపరింటెండెంట్​ కోపోద్రిక్తుడై ఏఎన్ఎంను కొట్టాడు. దీంతో మహిళ ఏడుస్తూనే ఇంటికి చేరుకుని.. జరిగిందంతా కుటుంబ సభ్యులకు చెప్పింది. కోపోద్రిక్తులైన కుటుంబీకులు సూపరింటెండెట్​కు దేహ శుద్ది చేశారు. పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సస్పెండ్​ చేసిన అధికారులు..

మహిళను లైంగికంగా వేధించిన నేపథ్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


ఆసుపత్రిలో ట్రైనీ నర్సింగ్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి డాక్టర్ హోదాకు అపకీర్తిని కలిగించడంతో తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ కు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పూర్తి వివరాలు  సమర్పించాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డాక్టర్ రామకృష్ణ రాజుకు ఇన్ చార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు అప్పగించారు.

First published:

Tags: Hospitals, Sangareddy

ఉత్తమ కథలు