తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు శుక్రవారం ఫోన్ చేసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పక్కాగా అమలవుతోందని, వైరస్ మరింత విస్తరించకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని వినోద్ కుమార్ ఉపరాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రంలో పేదలు, వలస కార్మికులకు ప్రభుత్వంతో పాటు దాతలను ప్రోత్సహించి బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, అవసరమైన చోట భోజన వసతి కల్పిస్తున్న విషయాన్ని ఉపరాష్ర్టపతి దృష్టికి తీసుకొచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు బాగానే ఉన్నాయన్న విషయం తన దృష్టికి వచ్చిందని, కరోనా వైరస్‌ను తుదముట్టించే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Venkaiah Naidu, Vice President of India