కరోనాపై జర్నలిస్టులు చేస్తున్న పోరాటం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిజం, నిష్పాక్షికత, ఖచ్చితత్వం, జవాబుదారీతనం, న్యాయబద్ధత, నైతికత, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మూలసూత్రాలకు మీడియా కట్టుబడి ఉండాలని ట్వీట్ చేశారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు మాత్రమే ప్రజలకు చూపించాలని, అందులో సొంత అభిప్రాయలు జోడించవద్దని అన్నారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం ఇస్తున్న భావప్రకటనాస్వేచ్ఛను సద్వినియోగ పరుచుకుంటూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా, ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా పత్రికలు, జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అవిస్మరణీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.