వచ్చే ఆరు గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోనుంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడవచ్చు.

news18-telugu
Updated: September 20, 2020, 2:59 PM IST
వచ్చే ఆరు గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వచ్చే ఆరు గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం ఆ మేరకు హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరం భీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మెట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోనుంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడవచ్చు. రోడ్లు తడిగా ఉండడం వల్ల జారుగా ఉంటాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. విద్యుత్, వాటర్, ఇతరత్రా సదుపాయాలకు అవాంతరాలు ఎదురవుతాయి. డ్రైనేజీలు బ్లాక్ అవుతాయి.

మరోవైపు రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading