కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన వెంకయ్య.. పండుగపై ఖతర్నాక్ కామెంట్స్

పరేడ్ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో 25 రాష్ట్రాల నుంచి 25 మంది కైట్ నిపుణులు పాల్గొంటున్నారు. ఇక స్వీట్ ఫెస్టివల్‌లో మొత్తం 1200 రకాల స్వీట్లను అందుబాటులో ఉంచారు.

news18-telugu
Updated: January 13, 2019, 7:06 PM IST
కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన వెంకయ్య.. పండుగపై ఖతర్నాక్ కామెంట్స్
వెంకయ్య నాయుడు(File)
  • Share this:
కష్టపడితే తీపి బతుకు వస్తుందని.. కష్టపడకుండా స్వీట్స్ తింటే సుగర్ వస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనదైన శైలిలో కామెంట్ చేశారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కైట్&స్వీట్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ పండుగ వెనుక ఓ కారణం.. ప్రతీ సాంప్రదాయం వెనుక ఒక విశేషం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

గాలిపటాన్ని ఎగిరేస్తే.. అది ఎంత దూరం వెళ్తే అంత మేర తమ సామ్రాజ్యం విస్తరించినట్టు పురాతన అర్థం అని, దాన్ని ఇప్పటికి అన్వయించుకుంటే.. పతంగుల లాగే మన ఊహాలు ఆకాశం అంత స్థాయికి చేరాలని అన్నారు. జీవితం అంటే బతకడమే కాదు.. సంతోషంగా బతకడం.. అన్ని రకాలైన కళలను ఆస్వాదించడం అన్నారు. తిండి, బట్ట, నివాసం, పదవుల కోసం కాకుండా.. సమాజంలోని చిత్రలేఖనం, నృత్యం, వాయిద్యం, క్రీడలు లాంటి అన్ని కళలను ఆస్వాదించాలని చెప్పారు.

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చూస్తే.. ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఈ సందర్భంగా వెంకయ్య గుర్తుచేశారు. పండుగలు దేశ సమైక్యతకు దోహదం చేస్తాయని, ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షనీయం అని అన్నారు. కాగా, పరేడ్ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో 25 రాష్ట్రాల నుంచి 25 మంది కైట్ నిపుణులు పాల్గొంటున్నారు. ఇక స్వీట్ ఫెస్టివల్‌లో మొత్తం 1200 రకాల స్వీట్లను అందుబాటులో ఉంచారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

First published: January 13, 2019, 6:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading