వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం.. శివ శివా... ఎంతపని చేశారు...

వేములవాడ ఆలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వతం మౌఢ్యం బిగించారు. ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన బోర్డు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వతం మౌఢ్యం బిగించారు. ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన బోర్డు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భాలయంలోకి ప్రవేశం నిషేధం ఉన్న సమయంలో ఎలా బిగించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మౌడ్యం ఏర్పాటు చేసిన విషయం గురించి తనకే తెలియదని స్థానాచార్యులు చెప్తుండడం గమనార్హం. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఆలయ గర్భగుడిలో డెకరేషన్ పేరిట కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గర్భాలయ గోడల్ని డ్రిల్లింగ్ చేయడం, గర్భాలయంలో శివుని ఫోటో ప్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగిందని, అసలు కరోనా సమయంలో గర్భగుడిలోకి అర్చకులు తప్ప ఇంకెవరికి ప్రవేశం లేని, గర్భగుడిలో ఎలాంటి చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కుడా శ్రీ శృంగేరి పీఠాధిపతి నుండి ఆదేశాలు తీసుకునే చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సూచించడం జరిగిందని, ముఖ్యమంత్రి సూచనలు కూడా పక్కనపెట్టి ఆగమ శాస్త్రానికి, సనాతన ధర్మానికి పూర్తిగా విరుద్ధంగా డ్రిల్లింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, చేసింది ఎవరైనా సరే తక్షణం వారిపై చర్యలు తీసుకోకపోతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని, బాధ్యులు ఎవరైనా సరే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: