వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ ?.. ఆరు నెలలైందన్న కాంగ్రెస్ నేత

Chennamaneni Ramesh: హరితహారం పారిశుద్ధ్య కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే గ్రామాల్లో ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యేపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 17, 2020, 5:44 PM IST
వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ ?.. ఆరు నెలలైందన్న కాంగ్రెస్ నేత
చెన్నమనేని రమేశ్(ఫైల్ ఫోటో)
  • Share this:
గత ఆరు నెలలుగా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కనిపించకుండా పోయారని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కొన్ని నెలలుగా ప్రజలకు కనిపించకుండా, ప్రజాసమస్యలు పట్టించుకోకుండా ఉన్న వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పారిశుద్ధ్య కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే గ్రామాల్లో ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యేపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని కోరారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరు నెలలుగా కనిపించక పోవడమే కాకుండా శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు కూడా రాలేదని అన్నారు. ప్రజా సమస్యలు తెలుపుదామంటే ఆయన కనిపించడం లేదని అన్నారు. కరోనా సహా అనేక సమస్యలతో వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. వారిని పట్టించుకునే ప్రజాప్రతినిధి కరువయ్యారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. తాను ముమ్మాటికి భారతీయుడినే అంటూ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ జర్మనీ పాస్ పోర్ట్‌పైన ప్రయాణం చేస్తున్న ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. .
Published by: Kishore Akkaladevi
First published: September 17, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading