• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • VEMULAWADA KONDAGATTU TEMPLES OPENED FOR DEVOTEES AFTER 80 DAYS BS

వేములవాడ రాజన్న దర్శనం ప్రారంభం.. ధర్మగుండంలో స్నానాలు, కోడె కట్టుట బంద్..

వేములవాడ రాజన్న దర్శనం ప్రారంభం.. ధర్మగుండంలో స్నానాలు, కోడె కట్టుట బంద్..

వేమలవాడ రాజన్న దర్శనం ప్రారంభం

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి నేటినుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లఘు దర్శనం కల్పిస్తున్నారు అధికారులు.

  • Share this:
    దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి నేటినుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లఘు దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. కోడె కట్టుట, తలనీలాల సమర్పణ, ధర్మశాలలు, ధర్మగుండం(కోనేరు)లో స్నానాలను నిషేదించారు. భక్తుల గర్భాలయ ప్రవేశము కూడా లేదు. అయితే, ఆన్ లైన్ ద్వారా భక్తుల ఆర్జిత సేవలు మాత్రము యదావిధిగా కొనసాగనున్నాయి. భక్తులను పార్కింగ్ స్థలం నుండి కోడె క్యూ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులను ముందుగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేస్తున్నారు. భక్తులలో ఎవరికైనా కోవిడ్ -19 రోగ లక్షణాలు కనిపిస్తే సదరు వ్యక్తిని గదిలో ఉంచి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వనున్నారు. ప్రతి ఒక్క భక్తుడు ఆరోగ్యసేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని, 65 ఏళ్లు పైబడిన వాళ్లు, పదేళ్లలోపు పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.

    అటు.. దాదాపు 80 రోజుల తర్వాత కొండగట్టు అంజన్న ఆలయం తెరుచుకున్నది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కంటైన్మెంట్ జోన్, రెడ్ జోన్ ఏరియాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేస్తున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు