• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • VEMULAVADA MLA CHENNAMANENI RAMESH BABU NOT AVAILABLE TO CONSTITUENCY FOR LAST ONE YEAR MS KNR

ఇక్కడో ఆర్నెళ్లు.. అక్కడో ఆర్నెళ్లు.. ఆన్లైన్ లోనే పాలన.. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకొద్దుంటున్న జనం..

ఇక్కడో ఆర్నెళ్లు.. అక్కడో ఆర్నెళ్లు.. ఆన్లైన్ లోనే పాలన.. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకొద్దుంటున్న జనం..

వేములవాడ ఆలయం

ఎమ్మెల్యే గారు ఆన్లైన్ లో ఉన్నా.. పాలన మాత్రం ఆఫ్లైన్ కు మళ్లింది. దీంతో ప్రజలకు ప్రభుత్వం నుంచి రావలసిన పథకాలు అందకుండా పోతున్నాయి. తమకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఏడాది పాటుగా నియోజకవర్గంలో అడుగుపెట్టకపోవడంతో అక్కడి జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

  • News18
  • Last Updated:
  • Share this:
    ఆయన గెలిచింది ఇక్కడ. ఓట్లు వేసింది తెలంగాణ ప్రజలు. ఉండేదేమో విదేశాల్లో.. తమకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే ఆయనేమో ఇక్కడ ఉండరు. ఆయన అనుంగులకు చెబితే అందినకాడికి దండుకుంటున్నారు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం తప్ప మిగతా సమయాల్లో ఆయన నియోజకవర్గంలో ఉండరు. ఆన్లైన్ లోనే పాలన సాగుతుంది. అభివృద్ధి ఊసే లేదు. గ్రామాల్లో పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఆన్లైన్ లో ఉన్నా.. పాలన మాత్రం ఆఫ్లైన్ కు మళ్లింది. దీంతో ప్రజలకు ప్రభుత్వం నుంచి రావలసిన పథకాలు అందకుండా పోతున్నాయి. తమకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఏడాది పాటుగా నియోజకవర్గంలో అడుగుపెట్టకపోవడంతో అక్కడి జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్...’ అంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా...?

    వేములవాడ రాజకీయం ఇపుడు తెలంగాణాలో హార్ట్ టాపిక్ గా మారింది. వేములవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్ బాబు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం విషయంలో ఇప్పటికే చాలాసార్లు కోర్టు మెట్లు ఎక్కారు. జర్మనీ పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ నేత అయినటువంటి ఆది శ్రీనివాస్ కోర్టుల చుట్టూ తిరిగి కేసులు వేస్తున్న విషయం విదితమే.

    Chennamaneni Ramesh, Chennamaneni Ramesh citizenship row, Chennamaneni Ramesh german citizen, Vemulawada mla chennamaneni Ramesh, చెన్నమనేని రమేష్ పౌరసత్వం, చెన్నమనేని రమేష్ వివాదం, జర్మనీ పౌరుడు వేముల వాడ ఎమ్మెల్యే
    చెన్నమనేని రమేశ్(ఫైల్ ఫోటో)


    రమేష్ బాబు కుటుంబ నేపథ్యం చూసుకుంటే, రమేష్ బాబు తండ్రి.. చెన్నమనేని రాజేశ్వర్ రావు కు జిల్లావ్యాప్తంగానే గాక రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన దగ్గర బంధువు కూడా. 5 సార్లు ఎమ్మెల్యే గా ఉన్నారు రాజేశ్వర్ రావు. అయితే రాజేశ్వర్ రావు కొడుకు రమేష్ బాబూ జర్మనీలో చదువుకొని అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొన్నాడు. అలా జర్మనీ పౌరసత్వం తీసుకోని అక్కడే ఒక యూనివర్సిటీ కి వైస్ ఛాన్స్లర్ గా పనిచేస్తున్నారు. రమేష్ బాబు రాజకీయం గురించి ప్రస్తావిస్తే.. టిడిపి లో ఉన్న ఆయన తెలంగాణా ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ లో చేరారు. 2014 లో వేములవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్ పై పోటీ చేసి గెలుపొందారు.

    ఎన్నికల అఫిడవిట్ లో తను భారతీయ పౌరుడినని.. తనకు ఇక్కడి పౌరసత్వం కూడా ఉన్నదని రమేష్ బాబు పేర్కొన్నారు. ఇదే విషయం పై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ కోర్టు ను ఆశ్రయించాడు. రమేష్ బాబు కు ఇండియా పౌరసత్వం లేదని.. ఆయన జర్మనీ పౌరుడని కోర్టుకు తెలపడం తో అప్పటినుండి పౌరసత్వం విషయం నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వాదోపవాదనలు వింటూ అప్పటినుండి ఇంకా కేసు నడుస్తూనే ఉంది.

    ఈవిషయం పక్కన పెడితే రమేష్ బాబు మొదటిసారిగా ఎమ్మెల్యే గా గెలిచినప్పటినుంచి ఇప్పటికీ ఆరునెలలు జర్మనీ లో... ఆరునెలలు నియోజకవర్గం లో ఉంటూన్నారు. ఐతే రెండోసారి మళ్ళీ రమేష్ బాబు.. కెసిఆర్ ఛరిష్మా తో తన రాజకీయ ప్రతర్ది ఐనటువంటి అది శ్రీనివాస్ పై తక్కువ మెజారిటీ తో గెలిచారు. గెలిచినా ఏడాది పాటు నియోజకవర్గం లో ఉంటూ కాస్తో కూస్తో అభివృద్ధి పనులు చేసారు. తరువాత జర్మనీ వెళ్లి సంవత్సరం అయినా తిరిగి రాకపోవడంతో నియోజకవర్గ ప్రజల కోపాలు కట్టలు తెంచుకుంటున్నది. 119 నియోజకవర్గాలలో ఇలాంటి ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదని.. అభివృద్ధి కుంటు పడుతుందని.. ఈ ఎమ్మెల్యే తమకు వద్దని ప్రజలు చాల రకాలుగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

    నియోజకవర్గం అభివృద్ధి అంత ఆన్లైన్ లో నే నడుస్తుంది.. ఏమైనా పనులు కావలనంటే జర్మనీ నుండి ఆన్లైన్ ద్వారా మీటింగ్ లు నడుస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారు రమేశ్ బాబు. MLA అందుబాటులో లేకపోవడం తో జిల్లా కలెక్టర్ పాలన అభివృద్ధి చూసుకుంటున్నారు. ఏదైనా ముఖ్యమైన పనులుంటే మంత్రి, సిరిసిల్ల శాసన సభ్యులు కేటీఆర్ చూసుకుంటున్నారు. రమేష్ బాబు నియోజకవర్గంలో లేకపోవడంతో చోటా మోట లీడర్లు పెత్తనం చెలాయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు.

    మరోవైపు.. రమేష్ బాబు ఇప్పట్లో జర్మనీ నుండీ వచ్చే అవకాశాలు తక్కువ అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. పౌరసత్వం కోర్టు తీర్పుగనుక ఆయనకు వ్యతిరేకంగా వస్తే.. వేములవాడ రాజకీయం ఒక్కసారి గా వేడెక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల చూపు ఒక్కసారి గా వేములవాడ నియోజకవర్గం పై పడడంఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి రమేష్ బాబు రాజకీయ మనుగడ కొనసాగిస్తారా..? లేక జర్మనీ లో నే ఉంటారా..? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు