హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : పూలు పూస్తున్న పెళ్లి పత్రిక... అదేలా అనుకుంటున్నారా... ?

Adilabad : పూలు పూస్తున్న పెళ్లి పత్రిక... అదేలా అనుకుంటున్నారా... ?

Adilabad : పెళ్లి బంధం కలకాలం నిలిచి పోయోలా అనేక జంటలు తమ పెళ్లి అందరికి గుర్తుండిపోయోలా ప్లాన్ చేస్తారు. మరికొంతమంది మాత్రం తమ పెళ్లి పలువురుకి ఆదర్శంగా ఉండేవిధంగా ప్లాన్ చేస్తారు.. ఈ క్రమంలోనే ఓ జంట తమ పెళ్లిలో ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నాలు చేశారు.

ఇంకా చదవండి ...

  పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. అయినవారందరిని పిలుచుకొని, బంధువులు, స్నేహితుల నడుమ కలకాలం గుర్తిండి పోయేలా పెళ్లి తంతును అంగరంగ వైభవంగా జరుపడం చూస్తున్నాం. పెళ్లిలో వేసుకొనె బట్టలు మొదలు కొని పెళ్ళి మండపం అలంకరణ, పెళ్ళిలో వడ్దించే భోజనం వరకు అన్నింట్లో ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం ఎంతైన ఖర్చు చేయడంలో వెనుకకు రావడం లేదు. అయితే పెళ్ళికి చుట్టాలు, సన్నిహితులను పిలిచేందుకు రకరకాల ఆహ్వాన పత్రికలను అచ్చువేయించడం చూశాం.

  ఆ ఆహ్వాన పత్రికలను కూడా తమ తమ అభిరుచుల మేరకు అచ్చువేయిస్తుంటారు. పత్రికలు అందుకున్న వారు కూడా పెళ్లి ముహుర్తం ఎప్పుడు, వేదిక ఎక్కడ చూసుకునేందుకు పెళ్ళి అయ్యె వరకు భద్రంగానే ఉంచుతారు. ఎట్లా చేసినా, ఎంత ఖరీదు పెట్టి అచ్చువేయించిన పెళ్లి తర్వాత ఆ కార్డులు చెత్త పాలుకావడం పరిపాటే. అయితే పెళ్ళి పిలుపుకు ఇచ్చే ఆహ్వాన పత్రికను వినూత్న పద్దతిలో తయారు చేయించి అందిరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ప్రవీణ్.

  నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగుల వాడకు చెందిన వనమాల, దేవిదాస్ దంపతుల కుమారుడు ప్రవీణ్ హైదరాబాద్ లో ఓ మెడికల్ దుకాణం నడుపుతాడు. ఈ నెల 27న అతని వివాహాం నిశ్చయమైంది. అయితే తన పెళ్ళికి అతిథులకు ఇచ్చే పత్రిక వినూత్నంగా ఉండాలని, పెళ్లి తర్వాత అది చెత్తపాలు కాకుండా తర్వాత కూడా ఉపయోగపడేలా ఉండాలని భావించాడు. అందరికి భిన్నంగా బంతి, గులాబి, తులసీ, పాలకూర తదితర పూలు, ఆకు కూరల విత్తనాలతో పెళ్ళి పత్రికలను ప్రత్యేకంగా తయారు చేయించాడు. ఈ పత్రికలను ఓ గంటపాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత పూలకుండీలో గాని, లేక వేరే చోట గాని మట్టిలో పెడితే, అది మట్టిలో కలిసిన తర్వాత ఆ పత్రికలో ఉన్న విత్తనాల నుండి మొలకలు వస్తాయి. వాటికి ప్రతిరోజు నీళ్ళు పోస్తే మొక్కలుగా ఎదుగుతాయి.

  ఈ పత్రికను ఎలా ఉపయోగించాలో కూడా ఆ పత్రికపై కింది భాగంలో ప్రచురించారు. పర్యావరణ హితమైన ఈ పత్రికపై దేశ నాయకులైన భగత్ సింగ్, ఛత్రపతి శివాజి, కుమురంభీం, స్వామి వివేకానంద తదితరుల ఫోటోలను కూడా ముద్రించి దేశభక్తిని చాటుకున్నాడు. అయితే పెండ్లి పత్రికను వినూత్నంగా తయారు చేయించాలన్న ఆలోచన వచ్చిన తాను సామాజిక మాధ్యమంలో చూసి తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ పత్రికను తయారు చేయించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఓక్కో పత్రికకు తనకు 50 రూపాయల ఖర్చయిందని పేర్కోన్నారు. అందరిలా కాకుండా విభిన్నంగా  తన పెళ్లి పత్రికలను తయారుచేయించిన ప్రవీణ్ ఆలోచనను బంధుమిత్రులే కాకుండా స్థానికులు కూడా అభినందిస్తున్నారు.

  First published:

  Tags: Adilabad, Marriage

  ఉత్తమ కథలు