విరసం నేత వరవరరావు పరిస్థితి విషమం

ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్‌లో వరవరరావుకు చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది.

news18-telugu
Updated: July 2, 2020, 1:32 PM IST
విరసం నేత వరవరరావు పరిస్థితి విషమం
విరసం నేత వరవరరావు(ఫైల్ ఫోటో)
  • Share this:
విరసం నేత వరవరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు తలొజా జైల్ నుండి ఆయన భార్యకు ఫోన్ చేసిన జైలు సిబ్బంది చేశారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. గత కొంతకాలంగా వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొద్దిరోజుల కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ANIA) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన వరవరరావును మొదట మహారాష్ట్ర పుణె లోని ఎరవాడ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు చనిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.

First published: July 2, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading