మొక్కలు నాటడం, చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ గత ఐదు దశాబ్ధాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పెద్దాయన వనజీవి రామయ్య(Vanjeevi Ramaiah)రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం(Khammam)జిల్లాకు చెందిన వనజీవి రామయ్య బుధవారం(Wednesday)ఉదయం మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న మోటర్ సైకిల్(Motorcycle) ఢీకొట్టింది. బైక్ యాక్సిడెంట్లో గాయపడ్డ రామయ్యను స్థానికులు వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రి(Private hospital)కి తరలించారు. ప్రస్తుతం రామయ్యకు ఐసీయూ(ICU)లో ఉంచి ట్రీట్మెంట్(Treatment)అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ సాధారణ రైతుగా ఉన్న రామయ్య కేవలం ప్రకృతి ప్రేమికుడిగా..వృక్షో రక్షతి రక్షితః అనే మాటను పట్టుకొని జీవితాన్ని గడిపేస్తున్నారు.
వనజీవికి ప్రమాదం..
ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కాని కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. తన ప్రయత్నంలో భాగంగానే ..ప్రతి చోట విత్తనాలు నాటుతూ ప్రజలకు మొక్కులు పెంచడం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ వస్తున్నారు. తన ప్రయత్నంలో భాగంగానే వనజీవి రామయ్య బుధవారం మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్తుండగానే ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలుస్తోంది. సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా..పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, అంతరించిపోతున్న వృక్ష సంపదను పెంచడానికి రామయ్య చేస్తున్న కృషిని ప్రజలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయనకు పద్మశ్రీ అవార్డును అందజేశారు నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ.
లక్ష్యం నెరవేర్చే క్రమంలోనే..
మంచి చెప్పేవారిని ఎప్పుడూ సమాజం అమాయకుడిగా,ఓ పిచ్చివాడిగానే చూస్తుంది. వనజీవి రామయ్య విషయంలో కూడా అదే జరిగింది. అయితే తన ప్రయత్నంలో స్వార్ధం లేదని..సమాజ హితం కోసం చేస్తున్న ప్రయత్నమని గుర్తింపు దక్కడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన గురించి ఆరవ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఓ పాఠంగా పొందుపర్చింది. అంతే కాదు ఆయనకు చెట్లు, మొక్కలను సంతానంగా, సంపదగా చూస్తున్నారు కాబట్టే రామయ్యకు వనజీవి రామయ్యగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తప్పిన ప్రమాదం..
ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడితే ఎవరైనా తమకు తోచిన సాయం చేస్తారు. కాని వనజీవి రామయ్య మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమానికి తన వంతుగా కోట్ల రూపాయల విలువ చేసే తాను పెంచిన 20టన్నుల ఎర్రచందనం చెట్లను విరాళంగా అందిస్తానని మాటిచ్చారు. కేవలం మొక్కులు నాటడమే జీవిత ఆశయంగా మలచుకున్న వనజీవి రామయ్యకు ప్రభుత్వం కూడా అంతే సహాయ, సహకారాలు అందజేస్తామని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Road accident, Telangana