వనమా రాఘవ ఎట్టకేలకు జైలు పాలయ్యాడు.. గత నాలుగు రోజులుగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న కేసులో రాఘవ ముద్దాయిగా ఉన్నాడు.. ఈ క్రమంలోనే అనేక పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎట్టకేలకు పోలీసులు వనమా రాఘవ అరెస్ట్‌ను అధికారికంగా చూపించారు. రాఘవతో పాటు ఆయన డ్రైవర్‌తో గిరిష్ మరియు మరో నిందితుడు మురళీలను నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కాగా రాఘవ పై ప్రస్తుత కేసుతో పాటు మొత్తం 12 కేసులు ఉన్నట్టు తెలిపారు.. కాగా వీటన్నింటికి సంబంధించి విచారణ జరిపినట్టు చెప్పారు. విచారణలో పలు విషయాలు వెల్లడించినట్టు వివరించారు. రామకృష్ణ కేసు విషయంలో పలు విషయాలను అంగీకిరంచినట్టు పోలీసులు తెలిపారు. రామకృష్ణను బెదిరింపులకు గురి చేసినట్టు అంగీకరించాడు. రామకృష్ణ హత్య కేసులో రాఘవతో పాటు ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా... కేసులో రాఘవతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ చేయగా మిగతావారు పరారీలో ఉన్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వివరించారు.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత వనమా రాఘవ ఆగడాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా రామకృష్ణ సెల్ఫీ వీడియోలు బయటపడడంతో తప్పించుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు..దీంతో రాఘవ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ ప్రతిపక్ష పార్టీలు సైతం నిన్న కొత్తగూడెం బంద్‌కు సైతం పిలుపునిచ్చాయి..
Family Suicide : తెలంగాణలో మరో కుటుంబం ఆత్మహత్య, సూసైడ్ నోట్.. ఏం చెప్పారంటే.. !
ఈ పరిణామాల నేపథ్యంలోనే రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు సైతం తన కొడుకు అరెస్ట్‌కు సహకరిస్తానని, కేసు తేలేవరకు రాజకీయాలకు దూరంగా ఉంచుతానని బహిరంగ లేఖ రాశారు. జరిగిన సంఘటనపై తాను విచారణ వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు.. అయితే ఆయన లేఖ రాసిన కాసేపటికే రాఘవ అరెస్ట్ జరిగినట్టు ప్రచారం జరిగినా పోలీసులు మాత్రం కొట్టిపారేశారు.. రాఘవ పరారీలో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇక రాఘవ అధికార పార్టీలో కొనసాగుతుండడంతో వేటు వేశారు.. అది జరిగిన కాసేపటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. దీంతో గత సాయత్రం నుండి రామకృష్ణ ఆత్మహత్య కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాత ఫిర్యాదులకు సంబంధించి 12 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Khammam