Home /News /telangana /

VANAJEEVI RAMAIAH FAMILY MEETS MP SANTHOSH KUMAR VRY

Vanajeevi Ramaiah : హరిత నిధికి వనజీవి రామయ్య విరాళం.. 20 టన్నుల ఎర్రచందనం బహుమానం..

ఎంపీ సంతోష్‌తో వనం రామయ్య దంపతులు

ఎంపీ సంతోష్‌తో వనం రామయ్య దంపతులు

Vanajeevi Ramaiah : పద్మశ్రీ వనజీవి రామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు.. తాను ఇన్నాళ్లు పెంచిన 20 టన్నుల ఎర్ర చందనం చెట్లను ప్రభుత్వానికి అప్పగిస్తానని ప్రకటించారు. ఈ సంధర్భంగా ఎంపీ సంతోష్‌తో హరితహారం పై చర్చించారు.

    తన జీవిత కాలం హరిత వనం కోసం తహతహలాడుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే ఎర్ర చందనం కలపను ప్రభుత్వానికి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వతహాగా కష్టపడి సుమారు 20 టన్నుల గత ఎర్ర చందనం చెట్లను పెంచారు. కాగా పూర్తిగా ప్రభుత్వానికి హరిత నిధికోసం అప్పగించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే రామయ్య దంపతులు ఎంపీ సంతోష్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి చెప్పారు.

    ఈ సంధర్భంగా తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా రామయ్య దంపతులు ఆకాంక్షించారు. ప్రస్తుతం మన ముందు ఉన్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే అని, అందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ, కొత్తగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచటమే అని అన్నారు. హరితనిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చేసిన 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు.

    Khammam : ముందుగా మర్యాద రామన్న ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మాములుగా లేదు కథ..

    ఈ సందర్భంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిపై సంతోష్ కుమార్ ఆరా తీశారు. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని, తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రామయ్య నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించేందుకు ఎంపీ సంసిద్దత తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు