Home /News /telangana /

VAIKUNTA EKADASI 2020 HEAVY NUMBER OF DEVOTEES THROWN FOR BADRADRI TEMPLE SB

భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

Video : భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు..

Video : భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు..

గరుడ వాహనంపై రామయ్య, స్వామివారి కుడి వైపున సీతమ్మ తల్లి, ఎడమ వైపున లక్ష్మణుడుతో భక్తులకు సీతరామచంద్రస్వామి దర్శనమిస్తారు.

    దక్షిణ అయోధ్య భద్రాద్రిలో వైభవోపేతంగా ముక్కోటి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు ప్రధాన ఘట్టం అవిష్కృతం కానుంది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సాగుతున్న ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి విశిష్టతను స్థలసాయి స్థానాచార్యులు వివరిస్తున్నారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. వేడుకలకు హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు మంత్రి సత్యవతి రాథోడ్  హాజరయ్యారు.  స్వామివారి దర్శనం కోసం భక్తులతో కిక్కిరిసిపోయారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇచ్చారు స్వామివారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు సాగిన ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. గరుడ వాహనంపై రామయ్య, స్వామివారి కుడి వైపున సీతమ్మ తల్లి, ఎడమ వైపున లక్ష్మణుడుతో భక్తులకు సీతరామచంద్రస్వామి దర్శనమిస్తారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Badradri, Vaikuntha Ekadashi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు