VH fires on Revanth Reddy : రేవంత్ రెడ్డి పీసీసీ అయితే..ఇంతే సంగతులు...వీహెచ్

వి.హనుమంతరావు(ఫైల్ ఫోటో)

VH fire on Revanth Reddy : రేవంత్ రెడ్డి‌ జైలుకు వెళితే పార్టీకి దిక్కెవరని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత వీ హనుమంతరావు ప్రశ్నించారు..పార్టీ అధ్యక్షుడు కాకముందే ఆయన అనుచరులు పార్టీ సీనియర్లను బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక పార్టీ అధ్యక్షుడు అయితే ఎవ్వరిని గాంధి భవన్‌కు రానివ్వరని అయన విమర్శించారు.

  • Share this:
కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి కోసం అంతర్గత పోరు కొనసాగుతోంది..పీసీసీ చీఫ్ తనకు దక్కాలంటే తనకు దక్కాలంటూ పోటి పడుతున్నారు. ఈ అంతర్గత పోరులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.దీంతో కాంగ్రెస్ పార్టీ సినియర్ ,జూనియర్ నేతల మధ్య వివాదం రాజుకుంటుంది..ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత వీహెచ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన అనుచరులతో బెదిస్తున్నాడని వీహెచ్ విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాకముందే పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనుచరులు బూతులు తిడుతున్నారని అన్నారు......ఇలా ఇప్పటికే తనను మూడు సార్లు బెదిరించారని ..ఇలాంటీ సాంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు..పార్టీ బతకాలంటే సీనియర్లు ,జూనియర్లు కలిసి పనిచేయాలని అన్నారు.. మరోవైపు పార్టీ ప్రెసిడెండ్ కోసం పోటిపడుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని గెలిపించాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ పరిస్థితులపై హైకమాండ్‌కు వివరించామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుండి వచ్చిన వారు మాపై ఎట్లా పెత్తనం చేస్తారని ప్రశ్నించారు..

కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినం ఇందులోనే చచ్చేవరకు ఉంటామని చెప్పారు..ఇలా బెదిరించేవాళ్లను చాలమందిని కూడ చూశామని అన్నారు..నేను కూడ హైదరాబాద్‌లో పుట్టానని హెచ్చరించాడు. తనను బూతులు తిట్టారని చెప్పినా... పార్టీలో క్రమశిక్షణ కమిటి కూడ స్పందించడం లేదని అన్నారు..పార్టీ నేతల్లో జానారెడ్డి మినహా రేవంత్ రెడ్డి మాటలను ఖండించలేదని అన్నారు..

గతంలో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని సైతం తాను విమర్శించానని కాని ఇలాంటీ పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని అన్నారు..తాను బీసీని కాబట్టే పార్టీలో ఎవరు స్పందించకపోవడంతో పాటు గాంధీభవన్‌లో కనీసం ప్రెస్‌మీట్ కూడ పెట్టనీయడం లేదని దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడ కేసిఆర్ కోవర్టులు ఉన్నారని అన్నారు..తనను ఎంత తిట్టినా చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు..

మరోవైపు టీపీసీసీ ఇవ్వాలనుకుంటే పార్టీ సీనియర్లకు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు.పీసీసిని బీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ రెడ్డిలకు ఇవ్వాలంటే పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని సూచించారు.
Published by:yveerash yveerash
First published: