హోమ్ /వార్తలు /తెలంగాణ /

అది ప్రభుత్వ అసమర్థత.. దొడ్డు బియ్యం తినలేకపోతురన్న ఉత్తమ్..

అది ప్రభుత్వ అసమర్థత.. దొడ్డు బియ్యం తినలేకపోతురన్న ఉత్తమ్..

ఉత్తమ్ కుమార్ రెడ్డి( ఫైల్ ఫోటో)

ఉత్తమ్ కుమార్ రెడ్డి( ఫైల్ ఫోటో)

ఓ ప్రముఖ అంతర్జాతీయ టివీ ఛానల్‌లో కోవిడ్-19 కేసులను ఇండియా దాచిపెడుతుందని ప్రసారం చేశారని తెలిపారు. అదేనిజమైతై దాచిపెట్టడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం జవాబు ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే దొడ్డు బియ్యం వందకు 80 శాతం మంది తినట్లేదని, తినడానికి వీలులేని బియ్యాన్ని ఇవ్వడం ప్రభుత్వ అసమర్థత అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇచ్చే రేషన్‌లో కేంద్రం ప్రకటించిన బియ్యం ఉందో లేదో ఎన్నిసార్లు అడిగినా సీఎంనుంచి సమాధానం లేదన్నారు. ఉజ్వల గ్యాస్ మాదిరిగానే రాష్ట్రంలోని కోటిమంది దీపం పథక లబ్దిదారులకు ఉచిత గ్యాస్ అందజేయాలన్నారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ టివీ ఛానల్‌లో కోవిడ్-19 కేసులను ఇండియా దాచిపెడుతుందని ప్రసారం చేశారని తెలిపారు. అదేనిజమైతై దాచిపెట్టడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం జవాబు ఇవ్వాలన్నారు.

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ట్రిపుల్ టి ఫార్ములో కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కోవిడ్- 19 పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తే వ్యాధి తీవ్రత ఎలా తెలుస్తుందన్నారు. జనాభాకు ఆహారం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అన్ని చెప్పారు.

First published:

Tags: Ration card, Telangana, Tpcc

ఉత్తమ కథలు