ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (World Tourism Organization) నిర్వహిస్తున్న బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ తరఫున మూడు గ్రామాలు పోటిపడిన గ్రామం తెలంగాణ(Telangana)లోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి. ఈ గ్రామాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) త్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా పోచంపల్లిని ఎంపిక చేశారు.. ఇక, డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. యూఎన్‌డబ్ల్యూటీవో(UNWTO) బెస్ట్ టూరిజం విలేజ్‌కు ఎంట్రీకి భూదాన్‌పోచంపల్లితో భారత దేశం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని లద్‌పురాఖాస్ గ్రామం, మేఘాలయ రాష్ట్రంలోని కాంగ్‌థాన్ గ్రామాలను కేంద్రం సిఫార్సు చేసింది. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా వివిధ దేశాల్లోని గ్రామీణ(Village) పర్యాటకాన్ని అంతర్జాతీయ సమాజానికి (Society) తెలియజెప్పడమే కాకుండా..
BEL Recruitment 2021: "బెల్"లో ఉద్యోగాలు.. జీతం రూ.లక్షపైనే.. అర్హతలు, దరఖాస్తు విధానం
ఆ గ్రామాల్లోని ప్రజల జీవన శైలి(Life Style)ని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం(Tourism) సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత దేశం నుంచి మూడు గ్రామాలను కేంద్రం పోటీలకు ఎంపిక చేసి పంపింది. ఇప్పటికే భూదాన్ పోచపంల్లి గ్రామాన్ని వంద దేశాలకుపైగా పర్యాటక సందర్శించారు. ఇక్కడ గ్రామీణ నేపథ్యాన్ని, చరిత్రను అభివృద్ది శైలిని అధ్యయనం చేశారు.
భూదాన్ పోచం పల్లి చరిత్ర..
భూదాన్ పోచంపల్లి గ్రామం చేనేత కళాకారులకు ప్రతిభకు చిరునామా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
FCI Recruitment 2021: పదో తరగతి అర్హతతో ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు.. అప్లై చేశారు?
ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టె(Match Box)లో పట్టెలో చీరలు నేసిన ఘనత ఉంది. ముఖ్యంగా అరబ్‌దేశాలకు చిన్న చిన్న అలంకరణ సామగ్రిని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. భూదానోద్యమానికి అంకురార్పన భూదాన్‌పోచంపల్లిలోనే జరిగింది. 1951లో వినోబాభావే పోచంపల్లికి వచ్చారు. ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి వెనుకబడిన వర్గాలకు 100 ఎకరాల భూమి దానం చేశారు. ఎంతో మంది విదేశీలు ఇక్కడ సాంస్కృతిక జీవన నేపథ్యాన్ని అధ్యాయనం చేయడానికి వస్తుంటారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఇక్కడ నిరుద్యోగ(Unemployed) యువతకు ప్రత్యేకంగా ఉపాధి కోర్సులు నిర్వహిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ideal village, Telangana