హోమ్ /వార్తలు /తెలంగాణ /

Indira Park: పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు.. ఈ బోర్డుపై ఇందిరా పార్క్ యాజమాన్యం యూటర్న్

Indira Park: పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు.. ఈ బోర్డుపై ఇందిరా పార్క్ యాజమాన్యం యూటర్న్

ఇందిరా పార్క్ ముందు ఫ్లెక్సీ

ఇందిరా పార్క్ ముందు ఫ్లెక్సీ

Hyderabad Indira Park: ఇందిరా పార్క్‌లోని పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదని ఏర్పాటు చేసిన బ్యానర్‌పై తీవ్ర దుమారం చెలరేగింది. మహిళా సంఘాలు, యువత పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో.. యాజమాన్యం వెనక్కి తగ్గింది. పార్క్ ముందు ఏర్పాటు చేసిన బ్యానర్‌ను తొలగించింది.

ఇంకా చదవండి ...

హైదరాబాద్ వాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్క్‌లు నగరంలో చాలానే ఉన్నాయి. సాయంత్రం పూట అలా చల్లగాలి పీల్చేందుకు చాలా మంది పచ్చని పార్కులకు వెళ్తుంటారు. పిల్లా పాపలతో తల్లిదండ్రులు, ప్రేమికులు, స్నేహితులు.. ఇలా ఎంతో మంది పార్క్‌ల్లో కూర్చొని కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి పార్క్‌ల్లో ఇందిరా పార్క్ ఒకటి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పార్క్.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అందరికీ సుపరిచితమైనది. చుట్టు పక్కల ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం వెళ్తుంటారు. అంతేకాదు ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తారు. అంతేకాదు ప్రేమ జంటలు కూడ ప్రైవసీ కోసం ఇక్కడే వాలిపోతుంటాయి. ఈ పార్క్‌లో ఎన్నో సినిమా షూటింగ్‌లు కూడా జరిగాయి. అలాంటి ఇందిరా పార్క్‌పై వివాదాలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇందిరా పార్క్‌కు వచ్చి ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారని, చుట్టూ జనం ఉన్నా ముద్దూ ముచ్చట్లు తీర్చుకుంటున్నారని పార్క్ యాజమాన్యానికి చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. అలాంటి వారితో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని కొందరు వాపోతున్నారు. ఈ క్రమంలోనే పార్క్ నిర్వాహకులు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కాని జంటకు పార్క్‌లోకి ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. పార్క్ ప్రవేశ ద్వారం ముందు ఓ పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కానీ ఆ నిర్ణ‌యం బెడిసి కొట్టింది. మహిళా సంఘాలతో పాటు యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యాజమాన్యం వెనక్కి తగ్గింది. అక్కడి నుంచి ఫ్లెక్సీని తొలగించారు.

Non Veg: చికెన్, మటన్ తినే మాంసం ప్రియులకు హెచ్చరిక.. కోసిన 3 గంటల్లో వండుకోవాలి.. లేదంటే..

ఇందిరా పార్క్ ముందు ఆ బోర్డు పెట్టగానే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పార్కు యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. ఇందిరా పార్క్‌లోకి వెళ్లే జంటలను ఎలా గుర్తిస్తారు? మీకు పెళ్లయిందా అని ప్రతి ఒక్కరినీ అడగుతారా? మహిళలు మెడలో తాళి బొట్టు లేదా కాలికి ఉన్న మెట్టెల్ని చూస్తారా? మరి బురఖా వేసుకొనే మహిళలను ఎలా గుర్తిస్తారు? ఇవన్నీ కాదు.. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకురావాలని అడుగుతారా? పోనీ .. పెళ్లయిన జంటే పార్క్‌లోనికి వెళ్లారని అనుకుందాం.. వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరని గ్యారంటీ ఇస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలను సంధించారు. పార్క్ యాజమాన్యంపై యువతతో పాటు మహిళా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్క్ నిర్ణయం మహిళలపై వివక్ష చూపేలా ఉందని దుమ్మెత్తిపోశాయి. మగవారికి పెళ్లయిందో కాలేదో ఎలాగూ గుర్తించలేరు. అందుకని మహిళలు, స్త్రీలు తాళి బొట్టు, మెట్టెలు చూపిస్తేనే లోపలికి పంపిస్తారా? అని విరుచుకుపడ్డారు. సభ్యత పేరుతో మహిళలపై ఇలా వివక్ష చూపుతారా.. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆ తలనొప్పి ఉండదు

అంతేకాదు పార్క్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి జోకులు పేల్చారు. ఇక నుంచి మీరు భార్యభర్తలు.. ఎంచక్కా పార్క్‌లోకి వెళ్లవచ్చని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. పార్కు బ‌య‌ట రూ.50కి మ్యారేజ్ స‌ర్టిఫికెట్ అనే వ్యాపారం కూడా చేసుకోవ‌చ్చని కొందరు సెటైర్లు వేశారు. ఈ వివాదంపై సికింద్రాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ స్పందించారు. వాటిని అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ డివిజ‌న్ అధికారులు తొల‌గించార‌ని ఆయన తెలిపారు. పార్కులోకి వెళ్లేవారికి అసౌక‌ర్యం క‌లిగించినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నామ‌ని చెప్పారు. ఐతే ఇందిరా పార్కులో నిఘా పెంచాల‌ని స్థానిక పోలీసుల‌కు స‌మాచారం అందించామ‌ని పేర్కొన్నారు.

First published:

Tags: Hyderabad, Indira Park, Telangana

ఉత్తమ కథలు