Home /News /telangana /

UNLOCK 1 LIQUOR STORES TO REMAIN OPEN TILL 8 PM IN TELANGANA SK

తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

రాత్రి గంటల నుంచి ఉదయం 5 వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈక్రమంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగణంగా తెలంగాణ ప్రభుత్వం సైతం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

    తెలంగాణలోని మద్యం ప్రియులకు శుభవార్త. రాష్ట్రంలో వైన్ షాపులు తెరిచ ఉంచే సమయం మరో 2 గంటలు పెరిగింది. ఇవాళ్టి నుంచి రాత్రి 8 వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. నిన్నటి వరకు సాయంత్రం 6 వరకు మాత్రమే అన్ని షాపులకు అనుమతి ఉంది. ఐతే లాక్‌డౌన్ 5, అన్‌‌లాక్ 1 లో భాగంగా కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చింది. రాత్రి గంటల నుంచి ఉదయం 5 వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈక్రమంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగణంగా తెలంగాణ ప్రభుత్వం సైతం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైన్ షాపుల్లో సైతం రాత్రి 8 వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి.

    కాగా, గతంలో ఎన్నడూ లేనంతగా ఆదివారం తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 199 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఆ 199 కేసుల్లో 196 కేసులు తెలంగాణ నుంచి వచ్చాయి. ముగ్గురు వలస కూలీలకు కరోనా సోకినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2698 మందికి కరోనాపాజిటివ్ వచ్చింది. అందులో 1428 మంది డిశ్చార్జ్ అయ్యారు. 82 మంది చనిపోయారు. 1188 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Liquor sales, Liquor shops, Lockdown, Lockdown relaxations, Telangana, Wine shops

    తదుపరి వార్తలు