హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : తండాలో కలకలం.. విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్.. ఇచ్చిన మహిళ ఎవరు?

Telangana : తండాలో కలకలం.. విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్.. ఇచ్చిన మహిళ ఎవరు?

తండాలో కలకలం.. విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్

తండాలో కలకలం.. విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్

Telangana News : స్కూల్ అయిపోయాక సరదాగా స్కూల్ ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటున్న ఓ బాలికపై గుర్తుతెలియని మహిళ ఘాతుకానికి పాల్పడింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయింది. ఇదంతా ఎలా జరిగింది? ఆమె ఎవరు? వివరాలు తెలుసుకుందాం. (సయ్యద్ రఫీ - న్యూస్18 తెలుగు ప్రతినిధి, మహబూబ్ నగర్)

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మహబూబ్‌నగర్ జిల్లా.. నవాజ్ పేట మండల పరిధిలోని పుట్టోనిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది అనన్య అనే ఎనిమిదేళ్ల విద్యార్థిని. గురువారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఒంటరిగా పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటుండగా ఓ అపరిచిత మహిళ... వైద్య సిబ్బంది రూపంలో అక్కడికి వచ్చింది. అనన్య అక్కడ ఉంచిన స్కూల్ బ్యాగును ఆమె తీసుకెళ్లేందుకు యత్నించింది. అది గమనించిన అనన్య తన బ్యాగు తనకు ఇవ్వాలని ఆ మహిళను అడిగింది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. పైగా.. తన వెంట తెచ్చిన ఇంజెక్షన్‌ను బలవంతంగా పాప కుడిచేతి నరానికి ఇచ్చినట్లు తెలిసింది.

ఇంజెక్షన్ ఇచ్చాక స్కూల్ బ్యాగును అనన్యకు ఇచ్చి.. అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది ఆ మహిళ. తర్వాత అనన్య ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూస్తే.. అనన్య అస్వస్థతతో కనిపించింది. ఏమైదని తల్లిదండ్రులు అలివేలు, లక్ష్మణ్ చిన్నారిని అడిగారు. ఎవరో ఆంటీ వచ్చి.. బెదిరించి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిందనీ, తనకు చెయ్యి నొప్పిగా ఉందని చెప్పింది పాప.

ఎవరో వైద్య సిబ్బంది ఇలా చేసి ఉంటారని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. కానీ రాత్రి సమయానికి బాలికకు అస్వస్థత మరింత పెరిగింది. దాంతో ఇంజెక్షన్ ఇచ్చిన వారి గురించి ఆరా తీశారు. గ్రామ ఆశా వర్కర్లు తాము ఇంజెక్షన్ ఇవ్వలేదని చెప్పారు. పాపకు జ్వరం మాత్రలు వేసి పడుకోబెట్టారు.

శుక్రవారం ఉదయం అనన్య వాంతులు, విరేచనాలు చేసుకుంది. తల్లిదండ్రులు వెంటనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు... బ్లడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ జరిగిందని తెలిపారు. వైద్య చికిత్సల తర్వాత పాపను ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా అస్వస్థతతోనే ఉండటంతో స్కూలుకు పంపలేదు.

ఇంజెక్షన్ ఇచ్చిందెవరు?

మండలానికి మారుమూలన ఉన్న గల తమ తండాలోకి వచ్చి.. ఇలా చేసిన మహిళను పట్టుకొని, తగిన చర్యలు తీసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా తండాలో చర్యలు తీసుకోవాలని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దీనిపై నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థిని తండ్రి లక్ష్మణ్ తెలిపారు. ఇలా ఓ అగంతకురాలు చేసిన పని తండాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆ చిన్నారి కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

First published:

Tags: Mahabubnagar, Telangana News

ఉత్తమ కథలు