హోమ్ /వార్తలు /తెలంగాణ /

Eetala : ఉమ్మడి పోరాటమే బెటర్ , అప్పుడే కేసిఆర్‌ను ఎదుర్కోగలం.

Eetala : ఉమ్మడి పోరాటమే బెటర్ , అప్పుడే కేసిఆర్‌ను ఎదుర్కోగలం.

మరోవైపు బిజెపి కార్యకలాపాలను సైతం ఈటల ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో బిజెపి పదాధికారుల సమావేశం నిర్వహించడంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు పాల్గొన్నారు.

మరోవైపు బిజెపి కార్యకలాపాలను సైతం ఈటల ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో బిజెపి పదాధికారుల సమావేశం నిర్వహించడంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు పాల్గొన్నారు.

Eetala : పార్టీలు ముఖ్యం కాదు..టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఈటల వర్గం. ఇందుకోసం కేసిఆర్ వ్యతిరేకులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్న నేతలు..ఈ నేపథ్యంలోనే ఈటల నివాసంలో కోదండరాం, కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డిలు భేటి అయ్యారు.

ఇంకా చదవండి ...

ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన తర్వాత తెలంగాణ రాజకీయా పరిణామాలు మరింత వెడెక్కాయి. ఈటల పార్టీ పెడతారనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలోనే వ్యుహ ప్రతివ్యుహాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది..ఈ నేపథ్యంలోనే కేసిఆర్ లాంటీ బలమైన నాయకున్ని ఎదుర్కొనేందుకు అందరు సంఘటితం కావడమే ముఖ్యమనే దిశగా పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలోనే కక్ష్యల కంటే పరిష్కారమే మార్గమనే సంకేతాలు ఇస్తున్నారు.

మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఈటల రాజేందర్ పలువురి పార్టీ నేతలను కలుస్తూ తనకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు..అయితే ఆయన్ను పలు పార్టీలు ఆహ్వానించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలు కూడ ఆఫర్‌ను ఇచ్చాయి. అయితే ఈటల లాంటీ నాయకుడు ఇతర పార్టీలోకి వెళతాడా అనే అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలోనే మరో ప్రత్యామ్నాయానికి వ్యూహాలు రచించిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందుకు అనుగుణంగా ఈటల పావులు కదుపుతున్నారా అనే సంకేతాలు కూడ వెలువడుతున్నాయి. తాజాగా కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితోపాటు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డిలు ఈటలతో భేటి అయ్యారు. ఈటల నివాసంలో భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. కాగా అయితే ఈటల బీజేపీలోకి చేరతారనే వార్తల నేపథ్యంలో వీరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.

భేటి సమయంలో కోదండరాం కూడ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో అందరూ ఏకతాటిపై ఉండాల్సిన సమయమిదని కోదండరాం సూచించారు. ఒకే ఆలోచనతో ఒకే మార్గంలో సాగాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త పార్టీ పెట్టడం ఒక్కటే పరిష్కారం కాదని కోదండరాం వ్యాఖ్యానించారు. మరోవైపు రాజకీయ పార్టీలు పెట్టి కక్ష్యలు సాధించేదుకు సమయం కాదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. వీటికి సంబంధించి చర్చించినట్టు ఆయన తెలిపారు.

అయితే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపి మాత్రమే ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసిఆర్ ను ఎదుర్కోవాలంటే బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.. అనేక మంది పార్టీలు పెట్టి విజయం సాధించలేకపోయారని గుర్తు చేస్తున్నారు. అయితే ఈటల ఒక పార్టీలోకి వెళ్లడం ద్వార ఇతర పార్టీ నేతల మద్దతు కూడగట్టేందుకు అవకాశం లేకుండా పోతుంది..దీంతో ఉమ్మడి ఐక్యవేదిక నిర్మాణం చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

First published:

Tags: CM KCR, Eetala rajender, Huzurabad By-election 2021, Kodandaram, Trs

ఉత్తమ కథలు