గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలపై వైఎస్ఆర్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) చేస్తున్న విమర్శలను గులాబీ నేతలు సీరియస్గా తీసుకుంటున్నారు. ఆమెపై అంతేస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు షర్మిలపై విమర్శలు గుప్పించగా.. తాజాగా మరో సీనియర్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్(CM KCR)ను అప్రతిష్ట పాలు చేసేందుకు సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
''తెలంగాణలో గత ఏడాది కాలంగా నెలకొన్న పరిణామాల వెనక సమైక్యవాదుల కుట్రలు ఉంది. సీఎం కేసీఆర్ను వారు టార్గెట్ చేస్తున్నారు. మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఏపీలో చేతగాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారు. బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్ర పేరుతో సీఎం కేసీఆర్ను అప్రతిష్టపాలు చేస్తోంది. '' అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
గవర్నర్ తీరు, బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర, షర్మిల పాదయాత్ర, తెలంగాణపై కేంద్రం వివక్ష.. వంటి పరిణామాలను చూస్తుంటే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబంపై కుట్రలు జరుగుతున్నట్లుగా అర్ధమవుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను చేసి ఓర్వలేకే.. ఇలాంటివి చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
YS Sharmila: షర్మిలకు ఇప్పటికైనా పొలిటికల్ మైలేజీ వస్తుందా ? ఆ పరిస్థితి మారకపోతే అంతేనా ?
కాగా, వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నర్సంపేటలో కొనసాగుతుండగా ఆమెపై, ప్రచార రథంపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఈ రచ్చ మొదలయింది. ఆ దాడి ఘటనతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి లోటస్ పాండ్క తరలించార. తరువాత ఆమె ప్రగతి భవన్కు వెళ్లే ప్రయత్నం చేయడం, పోలీసులు అడ్డుకోవడం, ఆమె కారులో ఉండగానే క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్కు తరలించడంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాలపై షర్మిల గవర్నర్ తమిళిసైని కలిసి.. ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు, కేంద్ర హోం శాఖ, సుప్రీంకోర్టు నాయ్యమూర్తులకు లేఖ రాస్తామని షర్మిల తెలిపారు. పాదయాత్రలో తనపై కానీ తన మనుషులకు ఏమైనా జరిగితే దానికి కారణం సీఎం కేసీఆరే కారణమని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.