UNION MINISTER PIYUSH GOYAL CLARIFIES ON PADDY PROCUREMENT FROM TELANGANA AK
Telangana: వడ్ల కొనుగోలుపై తేల్చిచెప్పిన కేంద్రమంత్రి.. తెలంగాణ సర్కార్‌కు కేంద్రం కౌంటర్
ప్రతీకాత్మక చిత్రం
Paddy Procurement: ఖరీఫ్ సీజన్ తరువాత యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై ఆలోచిద్దామని మంత్రి రాజ్యసభలో తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాలతో వరి ధాన్యం కొనుగోలు విషయమై ఎంఓయూలు చేసుకొంటామని.. దీని ప్రకారంగానే తాము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పీయూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు.
వడ్లు కొనుగోలు అంశంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. ప్రతి ఏటా వరి ధాన్యం కొనుగోళ్లను పెంచుకుంటూ పోతున్నామని ఆయన తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్ తరువాత యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై ఆలోచిద్దామని మంత్రి రాజ్యసభలో తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాలతో వరి ధాన్యం కొనుగోలు విషయమై ఎంఓయూలు చేసుకొంటామని.. దీని ప్రకారంగానే తాము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పీయూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం తమకు లేఖ ఇచ్చిందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఈ అంశంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు వరి కొనుగోలు అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందా లేదా చెప్పాలని కోరారు. అది ఎటువంటి ధాన్యమైనా సేకరించాలన్నారు. తెలంగాణ నుంచి ప్రతి గింజను కొంటామని ఓ కేంద్ర మంత్రి చెప్పారని, ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందా లేదా అని ప్రశ్నించారు. గత ఏడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొన్నదని, కానీ ఈ ఏడాది కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు కేశవరావు తెలిపారు. గత ఏడాది తీసుకున్నంత ధాన్యం ఈ ఏడాది తీసుకుంటారా అని కేంద్రాన్ని కేశవరావు నిలదీశారు. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం 60 శాతం పెరిగిందని గుర్తు చేశారు.
ఇదే అంశంపై టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. రబీలో పారాబాయిల్డ్ రైస్ మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, ఆ రైస్‌ను కొంటారా కొనరా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో పండిన పంట అంశంపై కేంద్రానికి డౌట్ ఉందని, కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా 99 శాతం ఆ డౌట్ క్లియరైందని వ్యాఖ్యానించారు. రబీ పంట కోసం తెలంగాణలో నాట్లు వేయడం మొదలయ్యాయని తెలిపారు. కానీ ధాన్యం కొంటారా లేదా అన్న అంశాన్ని మార్చిలో చెబుతామని కేంద్ర మంత్రి చెప్పడం సరికాదని అన్నారు. రబీలో పండే పారాబాయిల్డ్ రైస్‌ను ప్రొక్యూర్ చేస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై అటు లోక్‌సభలోనూ సభ్యులు నిరసన తెలిపారు. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత అయిదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నట్లు లోక్‌సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చామని, రైతు బంధు ఎకరానికి 10వేలు ఇవ్వడం.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందాయన్నారు. దీంతో ఎక్కువ శాతం పంట దిగుబడి పెరిగిందని నామా తెలిపారు. వరి ఉత్పత్తిలో ఇండియాలో నెంబర్ వన్ అయ్యామన్నారు. దాని వల్ల వరి సేకరణ సమస్య ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో మాట్లాడామన్నా నామా.. ఒకసారి తీసుకుంటామని.. మరోసారి తీసుకోమని కేంద్రం అంటోందని ఆరోపించారు. ఎఫ్‌సీఐకి కోటా ఇవ్వడంలేదన్నారు. తెలంగాణ రైతులు రోడ్డుమీదపడ్డారని, ధాన్యం సేకరణ గురించి ఆరు సార్లు మీటింగ్ జరిగినా.. కేంద్రం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.