Home /News /telangana /

UNION MINISTER KISHAN REDDY SAYS MORE THAN FOUR AND HALF LAKH PADDY BAGS MISSED IN RICE MILLS OF TELANGANA AK

Kishan Reddy: ఆ 4.53 లక్షల ధాన్యం బస్తాలు ఏమయ్యాయి ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: 40 రైస్ మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బస్తాల ధాన్యం తక్కువగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ ధాన్యం బస్తాలన్నీ ఏమయ్యాయో స్పష్టత కావాలని డిమాండ్ చేశారు.

    తెలంగాణలో ఉన్న రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు లెక్కలకు తగ్గట్టుగా లేవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం చెప్పినట్టుగా రైస్ మిల్లుల్లో ధాన్యం లేవని తెలిపారు. రైస్ మిల్లులో నిల్వ ఉన్న ధాన్యంలో తేడాలుంటున్నాయని వ్యాఖ్యానించారు. 40 రైస్ మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బస్తాల ధాన్యం తక్కువగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ ధాన్యం బస్తాలన్నీ ఏమయ్యాయో స్పష్టత కావాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి రైస్ మిల్లులపై (Rice Mills) అధికారం లేదని.. వీటిపై అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే అని స్పష్టం చేశారు. దీనిపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి(Telangana Government) లేఖ రాస్తామని అన్నారు. రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయాలని ఎఫ్‌సీఐని ఆదేశించామని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. రైస్ మిల్లులకు ఎఫ్‌సీఐకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. రైస్ మిల్లులపై సీబీఐ విచారణ చేయాలని కొందరు కేంద్రానికి లేఖ రాశారని.. కానీ అలాంటి విచారణ చేసే అవకాశం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

    కేంద్రంతో కొన్ని రోజులపాటు ధాన్యం కొనుగోలుపై పోరాటం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు రైతుల నుంచి ధాన్యాన్ని తామే పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ విషయంలో కేంద్రం, బీజేపీని టార్గెట్ చేసే విషయంలో అధికార పార్టీ కొంతవరకు విజయం సాధించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే రైస్ మిల్లర్లు ప్రభుత్వం కలిసి రైతులను మోసం చేశారని.. కనీస మద్దతు ధర కంటే తక్కువ రేటుకు కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాయని విపక్షాలు ఆరోపించారు.

    ఈ అంశంలో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందని.. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ, కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్రాన్ని కోరాయి. అయితే తాజాగా ధాన్యం బస్తాలు లెక్కల్లో తేడాలున్నాయంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. కేంద్రం, బీజేపీ కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయేమో అనే చర్చ కూడా మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. వాళ్లు కూడా ఈ ఆరోపణలపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Bandi Sanjay: నిజాం పాలనలో అరాచకాలన్నీ.. ఈ టీఆర్​ఎస్​ పాలనలో కనిపిస్తున్నాయి.. కేసీఆర్​పై బండి సంజయ్​ ధ్వజం

    CM KCR vs Governor: గిల్లికజ్జాలు.. తమిళిసై అత్యుత్సాహం: తలసాని సంచలనం

    అయితే కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో కొర్రీలు పెట్టిందని ఆరోపించిన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏ రకంగా కౌంటర్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో క్రెడిట్ గేమ్‌లో భాగంగానే ఈ రకంగా కొత్త కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Kishan Reddy, PADDY PROCUREMENT

    తదుపరి వార్తలు