తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫైర్ అయ్యారు. నిన్న అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై కేసీఆర్ చేసిన ఆరోపణలకు ఆయన ఇవాళ కౌంటర్ ఇచ్చారు. దేశ అభివృద్ధి గురించి మాట్లాడిన కేసీఆర్ రాష్ట్ర ప్రగతిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్, ధరణి పోర్టల్ పై ఎందుకు మాట్లాడలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రధానిని తిట్టడానికే పెట్టినట్లు ఉన్నాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇక దేశ ఆర్ధిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి (Kishan Reddy) సవాల్ విసిరారు. కేసీఆర్ ఎక్కడికి రమ్మన్నా చర్చకు వస్తానన్నారు. ప్రెస్ క్లబ్ కు రమ్మంటారా? ఫామ్ హౌజ్ కు రమ్మంటారా? గన్ పార్క్ కు రమ్మంటారా? ప్రగతిభవన్ కు రమ్మంటారా అంటూ ప్రశ్నించారు. ఇక రాజీనామా చేస్తానని కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. రాజీనామాపై కేసీఆర్ కు ఎందుకంత తొందర. అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజ్ భవన్ కు రాజీనామా లేఖ ఇవ్వక తప్పదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో పోలుస్తూ భారతదేశాన్ని విమర్శించడం కల్వకుంట్ల కుటుంబానికి పరిపాటిగా మారిందని కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు.
కాంగ్రెస్ ను పొగడడం..ప్రధానిని తిట్టడమే సరిపోయింది..
ఇక అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కాంగ్రెస్ ను పొగడడం ప్రధానిని తిట్టడానికే సరిపోయింది. అసలు మండలిలో కాంగ్రెస్ లేకుండా చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నది ఎవరు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోరుతున్నారు తెలుస్తుంది. మజ్లీస్ ను ఒక్కరోజు కూడా పొగడకుండా ఉండలేడు. వామపక్ష పార్టీలను తిట్టి వారితోనే కలిసి ముందుకెళ్తున్నారు. ఇవి అసలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలా లేక ప్రధానిని తిట్టే సమావేశాల అని కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు.
2014లో తెలంగాణ అప్పు 60 వేల కోట్లు ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. నన్ను విమర్శించే హక్కు కేసీఆర్ కు రాలేదు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ఎన్నో సార్లు లేఖలు రాశా. ఇప్పటివరకు రాష్ట్రం నుండి సహకారం లేదన్నారు. కల్వకుంట్ల భాష కాదు..తెలంగాణ భాష మాట్లాడాలని కిషన్ రెడ్డి (Kishan Reddy) హితవు పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kcr, Kishan Reddy, Telangana, Telangana Politics