కేంద్రం సూచనలు అమలు చేయండి... కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను భయాన్ని తొలగించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.

news18-telugu
Updated: June 9, 2020, 7:14 PM IST
కేంద్రం సూచనలు అమలు చేయండి... కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ
కేసీఆర్, కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రజల్లో అభద్రతాభావం, భయం పెరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను భయాన్ని తొలగించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని కిషన్ రెడ్డి కోరారు. ఇంటింటి సర్వే అమలు పరిచి సకాలంలో రోగులను గుర్తించి చికిత్స అందజేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగాన్ని వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తూ, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు మార్గదర్శకాలు పాటిస్తూ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు దూరం చేయాలని కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి కోరారు.
Published by: Kishore Akkaladevi
First published: June 9, 2020, 7:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading