Kishan Reddy: డబ్బులు ఇవ్వడం వల్ల మేలు జరగదు.. కేంద్రంపై నిందలొద్దన్న కిషన్ రెడ్డి

Kishan Reddy Comments: మూసి ఆక్రమణలకు గురవుతోందన్న కిషన్ రెడ్డి... ఇలాగే కొనసాగితే ఇబ్బందికి గురయ్యేది పేద ప్రజలే అని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: October 22, 2020, 9:41 PM IST
Kishan Reddy: డబ్బులు ఇవ్వడం వల్ల మేలు జరగదు.. కేంద్రంపై నిందలొద్దన్న కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తాను ప్రధాని మోదీ, అమిత్ షాలను కోరడం వల్లే కేంద్ర బృందాలు తొందరగా తెలంగాణకు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏమర్జెన్సీ కింద ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలని అన్నారు. ఈ నిధుల్లో 75శాతం కేంద్రం 25 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని అన్నారు. కేంద్రం సాయం చేయడం లేదని అనవసరంగా నిందలు వేయడం సరికాదని అన్నారు. తెలంగాణకి నిధులు తప్పక వస్తాయని.. తాను గమనించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో చెరువుల నిర్వహణ సరిగ్గా లేదని కిషన్ రెడ్డి అన్నారు ఓపెన్ నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.

మూసి,గండి పేట గేట్లు ఎత్తడంలో ఇబ్బంది పడ్డామని... ముందస్తు చర్యలు తీసుకోవడంలో వెనకబడ్డామని వ్యాఖ్యానించారు. మూసి ఆక్రమణలకు గురవుతోందన్న కిషన్ రెడ్డి... ఇలాగే కొనసాగితే ఇబ్బందికి గురయ్యేది పేద ప్రజలే అని అభిప్రాయపడ్డారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కరెక్ట్ కాదని తెలిపారు. పైప్ లైన్‌లు మూసుకుపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు శాశ్వత పరిస్కారం గురుంచి ఆలోచించాల్సి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు, టెక్నికల్ నిపుణులతో సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలని.. నగర ప్రజలను కష్టాల నుంచి కాపాడాలని అన్నారు. డబ్బులు పంచడం వలన మేలు జరగదు అని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుబట్టారు. ప్రజలు డబల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్ష బాధితుల సహాయం అందరికి అందేలా చూడాలని అన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని.. అందరితో సమావేశం అవుతుందని అన్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: October 22, 2020, 9:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading