UNION MINISTER KISHAN REDDY ASSURES AGRIGOLD VICTIMS MK
అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి...
అగ్రిగోల్డ్ లోగో
అగ్రిగోల్డ్ బాధితులకు తగిన న్యాయం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వస్తున్న ఆయనను జడ్చర్ల వద్ద అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు.
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి అగ్రిగోల్డ్ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద కిషన్‌రెడ్డికి అగ్రిగోల్డ్ బాధితులు కలిసి వినతి పత్రం సమర్పించారు. అగ్రిగోల్డ్ బాధితులకు తగిన న్యాయం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వస్తున్న ఆయనను మార్గమధ్యంలో జడ్చర్ల వద్ద అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు. తన పరిధి విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే జడ్చర్లలో కిషన్‌రెడ్డికి బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.