సంతోష్ బాబు అమరుడు కావడం బాధకరం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారత భూభాగాన్ని రక్షించుకునే దిశగా మన ఆర్మీ పనిచేస్తుందన్న ఆయన త్రివిధ దళాలకు మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు. చైనాతో ఒకవైపు సంప్రదింపులు చేస్తూనే, మన ఆర్మీ భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు.

news18-telugu
Updated: June 21, 2020, 7:52 PM IST
సంతోష్ బాబు అమరుడు కావడం బాధకరం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి (File)
  • Share this:
వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సంతోష్‌ బాబు కుటుంబ సభ్యులను కిషన్‌రెడ్డి సూర్యాపేటలో పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులో అంత్యంత ప్రతిభ కనబర్చి సంతోష్ వీర మరణం చెందారని అన్నారు. ఆర్మీలో అతి చిన్న వయసులో కల్నాల్ స్థాయికి ఎదిగి, మంచి పేరు సంపాదించిన సంతోష్ బాబు అమరుడు కావడం అత్యంత భాదాకరమని ఆయన అన్నారు. భారత భూభాగాన్ని రక్షించుకునే దిశగా మన ఆర్మీ పనిచేస్తుందన్న ఆయన త్రివిధ దళాలకు మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు. చైనాతో ఒకవైపు సంప్రదింపులు చేస్తూనే, మన ఆర్మీ భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీ భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

చైనా దురాగతాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారని కిషన్‌ రెడ్డి చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి భారత సైన్యం అండగా ఉంటుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
First published: June 21, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading