కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitaraman) గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR)పై విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో పాల్గొన్న మంత్రి సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకాలకు తెలంగాణ పేర్లు మార్చి వాడుకుంటోందని సాధారణ విమర్శలు మొదలు పెట్టిన నిర్మల.. తెలంగాణ అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అప్పులు FRBM పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారని అన్నారు. రాష్ట్రంలో అప్పుడే పుట్టినబాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్ధితి వుందని కేంద్ర మంత్రి అన్నారు. ఉపాధి హామీ పథకం కోసం 20 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. కేంద్రం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని నిర్మల హెచ్చరించారు. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని.. తానే ప్రధాని అన్నట్లు కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని నిర్మల వ్యాఖ్యానించారు.
అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. దేశం మొత్తం తిరిగే ముందు తమ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై సమాధానం చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు.
ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారని.. లాభాల్లో వున్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారంటూ కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి అమల్లోకి రావాలని.. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు.
ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్టుగా పెంచుతున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని, మన వూరు - మన బడి కేంద్ర పథకం అయితే దానిని రాష్ట్ర స్కీమ్‌గా ప్రచారం చేసుకుంటున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Maoists: మళ్లీ మావోల అలజడి.. లాస్ట్ మినిట్‌లో KCR పర్యటనలో మార్పులు అందుకేనా?
తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని, ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో వుందని ఆమె వ్యాఖ్యానించారు. బడ్జెట్లో చాలా అప్పులు చూపించడం లేదని... బయట తీసుకునే వాటిని శాసనసభకు తెలియనివ్వడం లేదని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. రాష్ట్రం అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి వుందన్న ఆమె.. ఎఫ్ఆర్బీఎం పరిమితిని తెలంగాణ దాటిపోయిందన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయనే ఆయుష్మాన్ భారత్‌లో చేరడం లేదని విమర్శించారు. లిక్కర్ స్కామ్‌లో ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని’పేర్కొన్నారు నిర్మలా సీతారామన్ .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirmala sitharaman