#Union Budget 2019: కేంద్రం ‘రైతుబంధు’ ప్రవేశపెడితే... తెలంగాణకు వరమే

Union Budget 2019: కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రైతుబంధు తరహా పథకం ఉండాలని తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఎక్కువగా కోరుకుంటోంది. దీని వల్ల తమకు రెండు రకాల లాభాలు ఉంటాయని గులాబీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

news18-telugu
Updated: February 1, 2019, 9:24 AM IST
#Union Budget 2019: కేంద్రం ‘రైతుబంధు’ ప్రవేశపెడితే... తెలంగాణకు వరమే
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ(Image: Facebook)
  • Share this:
కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని ఆశిస్తున్న తెలంగాణ ప్రభుత్వం... మరిన్ని అంశాలకు సంబంధించి కేంద్రానికి వినతి పత్రాలను సమర్పించింది. ఇవన్నీ ఎలా ఉన్నా... తెలంగాణ తరహాలో కేంద్రం కూడా రైతుబంధు పథకం ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా కోరుకుంటోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ను కేంద్రం అమలు చేసిందనే క్రెడిట్ తమకు దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం తమకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. రైతు సంక్షేమంలో అంతా తమను ఫాలో కావాల్సిందే అని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. దీంతో పాటు కేంద్రం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తే టీఆర్ఎస్‌కు మరో వెసులుబాటు కూడా లభించనుంది.

కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెడితే... ఇకపై కేంద్రం నుంచే ఈ పథకానికి నిధుల రాక మొదలవుతుంది. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా 20 వేల కోట్ల రూపాయల నిధులు ఆదా అవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతు బంధు పథకం మొత్తాన్ని పెంచాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం... కేంద్రం కూడా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. ప్రధాని మోదీ ఇదే తరహా పథకానికి రూపకల్పన చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో... కేంద్రం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
First published: February 1, 2019, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading