హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: పాఠశాలలో క్షుద్రపూజలు చేసిన దుర్మార్గులు.. ప్రధాన ద్వారం వద్ద ముగ్గులు, విచిత్ర బొమ్మలు, కోడిగుడ్లు.. భయాందోళనలో విద్యార్థులు..

OMG: పాఠశాలలో క్షుద్రపూజలు చేసిన దుర్మార్గులు.. ప్రధాన ద్వారం వద్ద ముగ్గులు, విచిత్ర బొమ్మలు, కోడిగుడ్లు.. భయాందోళనలో విద్యార్థులు..

పాఠశాల గేటు వద్ద పూజలు చేసిన ఆనవాలు

పాఠశాల గేటు వద్ద పూజలు చేసిన ఆనవాలు

ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రహారి ముందర ఉన్న ప్రధాన ద్వారం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చేసిన క్షుద్రపూజలు చేయడంతో స్థానికంగా కలకలం రేపింది.

ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (government ideal school) ప్రహారి ముందర ఉన్న ప్రధాన ద్వారం (Main Entrance) వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చేసిన క్షుద్రపూజలు (occult worship in school) చేయడంతో స్థానికంగా కలకలం రేపింది. పిల్లలు తిరిగే ఈ ప్రదేశంలో ఇలాంటి పూజలు చేయడమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమవుతుందోనన్న భయాందోళనతో తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు జంకుతున్నారు. అసలు విషయానికి వస్తే… ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు (Witchcraft in school) చేసినట్లు ఆనవాళ్ళు బయటపడ్డాయి. రాత్రి పూట ఈ పూజలు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

black magic2

పాఠశాల ప్రధాన గేటు వద్ద ప్రత్యక్షమైన ముగ్గులు, విచిత్ర బొమ్మలు కోడిగుడ్లు, నిమ్మకాయలు, మిరపకాయలను గమనించిన పాఠశాల వాచ్ మెన్ ఈ సమాచారాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు. ఆ తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావిద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆనవాళ్లు శుభ్రం చేస్తున్న సిబ్బంది

కాగా, ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్.ఐ వర్సెస్ బిట్ల పేర్కొన్నారు. రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అక్కడి నుండి ఆ సామాగ్రినంతా తొలగించారు.

గతంలో వరంగల్‌ జిల్లాలో ..

ఇదే మాదిరిగా పాఠశాలలో క్షుద్రపూజలు చేసిన వైనం గతంలోనూ చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి దెయ్యాలు వస్తున్నాయని ఓ పాఠశాల హెచ్‌ఎం కుద్రపూజలు (Witchcraft in school) చేయించిన ఘటన వరంగల్‌ జిల్లాలో గతంలో జరిగింది. విద్యార్థులు సరిగా పాఠశాలకు రావడం లేదని, తన ఆరోగ్యం బాగుండటం లేదని మూఢ నమ్మకాలతో ఓ ప్రధానోపాధ్యాయురాలు భూత వైద్యుడితో క్షుద్రపూజలు (Witchcraft in school) చేయించింది. కమలాపూర్‌ మండలం శంభునిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో పాఠశాల విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.

ప్రధానోపాధ్యాయురాలు అంతకుముందు నాలుగు రోజుల నుంచి పాఠశాలకు రాలేదు. ఓ భూత వైద్యుడిని తీసుకువచ్చి పూజలు చేయించినట్లు పాఠశాల ఆవరణలో ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్షుద్రపూజలు చేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.  భూతవైద్యుడిని, ప్రధానోపాధ్యాయురాలును అదుపులోకి తీసుకొని విచారించారు. ఇలాంటి క్షుద్రపూజలను ఎవరు నమ్మవద్దని పోలీసులు అక్కడి స్థానికులకు తెలిపారు. గొప్ప గొప్ప చదువులు చదివిన కొందరికి మూఢ నమ్మకాల విషయంలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. టెక్నాలజీ యుగంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మన దురదృష్టకరం.

First published:

Tags: Adilabad, Black magic, Devotional, School

ఉత్తమ కథలు