హైదరాబాద్‌లో దారుణం.. ఏటీఎం యంత్రాలకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్టలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు.

news18-telugu
Updated: February 11, 2020, 12:29 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ఏటీఎం యంత్రాలకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్టలో దారుణం చోటచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు చాంద్రాయణగుట్టలోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న ఐసీఐసీఐ, యాక్సిస్ ఏటీఎం యంత్రాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యారు. ఈ ఘటనలో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే స్థానికంగా ఉండే పోకిరీలు ఏటీఎంల్లో దోపిడీకి యత్నించగా, ఏటీఎం లాకర్లు తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు తెలుస్తోంది.

అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది కమాండ్ కంట్రోల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ చర్యకు పాల్పడిందా.. స్థానికంగా ఉండేవారా లేక దోపిడి దొంగల పనేమైనా ఉందా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సేకరించిన సీసీ టీవీ పుటేజీల ఆధారంగా ఒక గుంపుగా వచ్చినవారే.. ఈ ఘాతుకానికి పాల్పడి ఉండోచ్చని, ఈ ఘటనలో ఐదాగురు యువకులు పాల్గొన్నారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే గతంలో రాజేంద్రనగర్‌లో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.

First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు