ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న తీర్పును సవాల్ చేస్తూ..సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High court)లో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సందర్బంగా వాడీవేడి వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు కోరుతూ సీఎస్ కు లేఖ రాశామని హైకోర్టుకు సీబీఐ (Central Burew of Investigation) పేర్కొంది. సూట్ మాకు ఎలాంటి డాకుమెంట్స్ ఇవ్వలేదు. ఇస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలపగా..హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆగాలని కోర్టు సీబీఐ (Central Burew of Investigation)కి సూచించింది. సిబిఐ వాదన కూడా వింటామని హైకోర్టు పేర్కొంది.
దీనితో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదు. అలాగే ఒక్క ఎమ్మెల్యేను కానీ కొనుగోలు చేయలేదు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని దామోదర్ రెడ్డి వాదించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరాలని కేసీఆర్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారని దామోదర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సిట్ దర్యాప్తు నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక తాజాగా హైకోర్టు తీర్పు కాపీ సీబీఐకి చేరింది. 98 పేజీలతో కూడిన ఈ తీర్పు కాపీలో కోర్టు కీలక విషయాలు ప్రస్తావించింది. ఈ కేసు సిట్ నుండి సీబీఐకి అప్పగించడానికి మొత్తం 45 కారణాలను కోర్టు పేర్కొంది.
ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ ఎంట్రీతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సిట్ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది. వీడియోలకు సంబంధించి పెన్ డ్రైవ్ లు, మ్యానువల్ పేపర్స్ సహా మిగతా అన్ని వివరాలు సీబీఐకి హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. కానీ కోర్టు ఆదేశాలిచ్చిన కూడా సిట్ ఆధారాలు ఇవ్వలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరి సోమవారం జరగబోయే విచారణలో కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.