హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu By-Poll: రాజగోపాల్ రెడ్డికి ఊహించని షాక్..రాత్రికి రాత్రే మునుగోడులో వెలసిన పోస్టర్లు

Munugodu By-Poll: రాజగోపాల్ రెడ్డికి ఊహించని షాక్..రాత్రికి రాత్రే మునుగోడులో వెలసిన పోస్టర్లు

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో ప్రచారంలో జోష్ పెంచారు. ఇక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేశారు.

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో ప్రచారంలో జోష్ పెంచారు. ఇక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేశారు.

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో ప్రచారంలో జోష్ పెంచారు. ఇక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు (Munugodu By-Poll) ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉపఎన్నికకు రోజులు గడుస్తుండడంతో తమ స్ట్రాటజీలను అమలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ నామినేషన్ సమర్పించిన గంటల వ్యవధిలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో పోస్టర్లు కలకలం రేపాయి. ఈ పోస్టర్లు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిశాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్టు పే అంటూ 18 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగిందని పోస్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు BJP18THOUSANDCRORES అంటూ ట్రాన్సక్షన్ ఐడీని ఉంచారు. అలాగే 500 కోట్ల బోనస్ అంటూ ఫోన్ పే ట్రాన్సక్షన్ తరహాలో కాంట్రాక్టు పేరుతో వేలాది పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అంటించారనేది తెలియరాలేదు. రాత్రికి రాత్రే పోస్టర్లను టీఆర్ఎస్ నాయకులైన, లేకకాంగ్రెస్ నాయకులైన అంటించి ఉంటారని కోమటిరెడ్డి వర్గం చెబుతుంది. మరి దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుండి ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని దుయ్యబట్టారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉపఎన్నికలో ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శలు చేస్తుంది. రాజగోపాల్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే పోస్టర్ల నాటకం ఆడుతున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి ఆయనపై కాంట్రాక్టు ఆరోపణలు వస్తున్నాయి.

కానీ మునుగోడులో  (Munugodu By-Poll) రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం ఇది తొలిసారి కాదు. రాజగోపాల్ రాజీనామా అనంతరం మునుగోడు  (Munugodu By-Poll) నిన్ను క్షమించదు అంటూ గతంలో పోస్టర్లు తీవ్ర దుమారాన్ని రేపాయి. 13 ఏళ్ల నమ్మకాన్ని ఓ కాంట్రాక్టు కోసం రూ.18 వేల కోట్లకు కక్కుర్తి పడి పార్టీ మారిన నీచుడివి అంటూ గతంలో పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడావ్ అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శల వర్షం కురిపించారు.

మరి కాంట్రాక్టు కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారన్న విషయాన్ని ప్రతిపక్షాలు తమ అస్త్రంగా భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. మరి ఈ అస్త్రం ప్రతిపక్షాలకు ఏ మేర పనికొస్తుందో చూడాలి.

First published:

Tags: Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు